జై హనుమాన్: హనుమాన్ జన్మ స్థలంలో పూజా కార్యక్రమాలతో షురూ 

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:01 PM

‘జై హనుమాన్‌’ (jai hanuman) సినిమా షురూ అయింది. ‘కాంతార’తో భారతీయ సినీ ప్రేక్షకులను అలరించిన  హీరో రిషబ్ శెట్టి  (rishab shetty) ఇందులో ఆంజనేయస్వామి పాత్రలో నటించనున్నారు.

‘జై హనుమాన్‌’ (jai hanuman) సినిమా షురూ అయింది. ‘కాంతార’తో భారతీయ సినీ ప్రేక్షకులను అలరించిన  హీరో రిషబ్ శెట్టి  (rishab shetty) ఇందులో ఆంజనేయస్వామి పాత్రలో నటించనున్నారు. రానా, తేజ సజ్జ ఇందులో కీలక పాత్రధారులు.  జాతీయ పురస్కార గ్రహీత ప్రశాంత్ వర్మ  దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ  ఐమ్యాక్స్‌ 3డీ ఫార్మాట్‌లో తీసుకురానుంది. ఆదివారం ఈ సినిమా పూజ కార్యక్రమాలతో మొదలైంది. కర్ణాటక, హంపిలోని ఆంజనేయస్వామి జన్మ స్థానంగా నమ్మే  అంజనాద్రి బెట్టలో ఈ సినిమాను మొదలుపెట్టారు.  తేజ సజ్జా(Teja Sajja) హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్‌’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న సినిమా ఇది. ‘హనుమాన్‌’కి మించి ఉంటుందని చెప్పారు. దర్శకుడు.     

'త్రేతాయుగంలో ఇచ్చిన మాట కలియుగంలో నెరవేరుతుంది. విధేయత, ధైర్యం, భక్తితో కూడిన ఇతిహాసగాథను మీ ముందుకు తీసుకొస్తున్నాం. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది -ఎక్స్‌ వేదికగా రిషభ్‌శెట్టి గతంలో పోస్ట్ చేశారు. 

Updated Date - Feb 22 , 2026 | 03:57 PM