Jagapathi Babu: కథను మలుపు తిప్పే పాత్రలాగే ఉంది..

ABN , Publish Date - May 26 , 2026 | 01:09 PM

ఓ పక్క పెద్ది  ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చి మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలో బిజీగా ఉన్నారు.

రామ్‌ చరణ్‌ (Ram Charan), జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రానున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఓ పక్క ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చి మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలో బిజీగా ఉన్నారు.

ఇందులో అప్పల సూరిగా నటించిన జగపతిబాబుతో  డబ్బింగ్ చెప్పిస్తున్నారు. కథను మలుపుతిప్పే పాత్ర ఇదని  ముందే హింట్ ఇచ్చారు మేకర్స్. జగ్గూభాయ్  చెబుతున్న డబ్బింగ్లో ఇంటెన్స్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఎంతో ఆర్ద్రతతో ఆయన డబ్బింగ్  చెబుతున్న వీడియో ఒకటి మేకర్స్ విడుదల చేశారు.  ఎమోషనల్‌ సీన్‌లో ఆయన ఒదిగిపోయి డైలాగులు చెప్పడం ఆకట్టుకుంటోంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్ వేయండి 

Updated Date - May 26 , 2026 | 01:36 PM