Jagpathi Babu: మీ స్వార్ధం కోసం పిల్లల్ని కనొద్దు

ABN , Publish Date - May 25 , 2026 | 05:07 PM

విలక్షణ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా ఎంత అయితే సక్సెస్ ని అందుకున్నారో.. ఒక నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అంతే విజయాలను అందుకుంటున్నాడు.

Jagapathi Babu

విలక్షణ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా ఎంత అయితే సక్సెస్ ని అందుకున్నారో.. ఒక నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అంతే విజయాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం జగపతిబాబు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. సినిమాల విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీలో ఎలాంటి ఫిల్టర్ లేకుండా మనసులో ఉన్నది ముఖం మీదనే మాట్లాడే స్వభావం ఉన్న నటుల్లో జగ్గూభాయ్ మొదటివరుసలో ఉంటాడు.


తనమీద తానే జోకులు వేసుకుంటాడు.. ఎవరు ఏమనుకుంటారు అనే భయం లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు. అయితే గతంలో జగ్గూభాయ్.. పిల్లల్ని కనడం గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడెందుకో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ జనరేషన్ వారిని పిల్లల్ని కనొద్దు అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. పిల్లని కంటే.. వారిని ఇబ్బందికి గురిచేసినట్లే అని చెప్పుకొచ్చాడు.


'పిల్లలు మాత్రం వద్దు. తరువాత మీ ఇష్టం. ఎందుకంటే ఈ లోకంలోకి ఈ పిల్లల్ని తీసుకురావద్దు. మన పిల్లల్ని తీసుకొస్తే వారు సఫర్ అవుతారు. నీ స్వార్ధం కోసం, నీ ఫన్ కోసం, నీ సాటిస్ఫ్యాక్షన్ కోసం.. పిల్లలు అంటే నాకిష్టం అని అంటావ్.. తరువాత వాళ్ళు ఇబ్బంది పడతారు. నువ్వు పోతావ్.. నేను పోతాను.. వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు. అందుకే, వాళ్ళ గురించి ఆలోచించండి. భవిష్యత్ గురించి ఆలోచించండి.. వాళ్ళు పుట్టకపోతే గొడవే లేదు. కలియుగం మనకు కనిపిస్తుంది. రోబిటిక్స్ అంటే కలియుగమే నా ప్రకారం. అమెరికాలో ఇప్పటికే రోబిటిక్స్ రెస్టారెంట్స్ వచ్చాయి. వందమందికి పని లేకుండా పోయింది. ఆ పని మెషీన్స్ చేస్తున్నాయి. ప్రపంచం వేరే డైరెక్షన్ లోకి వెళ్తోంది. అటువంటి ప్రపంచంలోకి ఈ పిల్లల్ని తీసుకురావడం ఎందుకు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - May 25 , 2026 | 05:20 PM