Jagapathi Babu: సుకుమార్ కి కథ చెప్పడమే రాదు

ABN , Publish Date - May 06 , 2026 | 04:04 PM

ఒకప్పుడు స్టార్ హీరోగా మహిళా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న జగపతిబాబు (Jagapathi Babu) ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

Jagapathi Babu

Jagapathi Babu: ఒకప్పుడు స్టార్ హీరోగా మహిళా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న జగపతిబాబు (Jagapathi Babu) ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. స్టార్ హీరో దగ్గర నుంచి కొత్త హీరో వరకు తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే జగ్గు భాయ్ వెంటనే చేసేస్తాడు. తాజాగా ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం గోదారి గట్టుపైన (Godari Gattupaina). సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటించిన ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా మే 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.


రిలీజ్ డేట్ దగ్గుపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జగపతిబాబు డైరెక్టర్ సుకుమార్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. సుకుమార్ కి అసలు కథ చెప్పడమే రాదని తెలిపాడు. సుకుమార్ సినిమాల్లో చాలావరకు జగపతిబాబు కనిపిస్తాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలు జగ్గుభాయ్ కి మంచి పేరు తీసుకొచ్చిపెట్టాయి. ఆ సినిమా కథలను తనకు చెప్పడానికి కూడా తడబడ్డాడని జగ్గుభాయ్ చెప్పుకొచ్చాడు.


'సుక్కు కథ చెప్పలేడు. ఈ విషయాన్ని అతను కూడా ఒప్పుకుంటాడు. నాన్నకు ప్రేమతో సినిమాకు అనుకుంటా.. తనేదో చెప్పడానికి ప్రయత్నించాడు. నేను వింటున్నాను. సార్, ఇవన్నీ కాదు.. మీరు చేసేయండి అని అన్నాడు. సరే, చేసేస్తాను అన్నాను. రంగస్థలానికి అయితే గంటన్నర యోగా చేసి వచ్చాడు కథ చెప్పడానికి. సార్.. ప్రెసిడెంట్ సార్, చొక్కా ఉండదు సార్, చుట్ట ఉంటుంది సార్.. బావుంటుంది సార్ అన్నాడు. సుక్కు కథ ఓకే, డేట్స్ చెప్పవా అన్నాను. అలా రంగస్థలం కథ ఒక నిమిషంలో చెప్పాడు' అని తెలిపాడు.

Updated Date - May 06 , 2026 | 04:53 PM