Jagapathibabu: మా ముఖాన కొట్టినా వదలకుండా మళ్లీ సినిమా చేస్తాం..
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:55 PM
జగపతి పిక్చర్స్‌లో అడవి శేష్, సాయిమార్తాండ్ కాంబోలో ఓ సినిమా ఉంటుందని ప్రకటించారు జగపతిబాబు. ఆయన కీలక పాత్ర పోషించిన చిత్రం 'వదలా'. లయ, హృతికా శ్రీనివాస్ కథానాయికలుగా నటించారు.
జగపతి పిక్చర్స్‌లో అడవి శేష్, సాయిమార్తాండ్ కాంబోలో ఓ సినిమా ఉంటుందని ప్రకటించారు జగపతిబాబు. ఆయన కీలక పాత్ర పోషించిన చిత్రం 'వదలా' (Vadala Movie). లయ, హృతికా శ్రీనివాస్ కథానాయికలుగా నటించారు. ఆకెళ్ల వి.కృష్ణ తెరకెక్కించారు. ఈ నెల 17న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
జగపతిబాబు మాట్లాడుతూ ‘ఈ సినిమా థీమ్ మీద చాలా నమ్మకం ఉంది. మనీ హైస్ట్ నుంచి ఈ సినిమా టైటిల్ వచ్చింది. ఇది క్యాచీ టైటిల్.. అందరికి కనెక్ట్ అవుతుంది. సినిమా చూసి ఎలా ఉందో ఆడియన్స్ చెప్పాలి. మీరు సినిమా చూసి తిరిగి మా ముఖాన కొడితే వదలకుండా ఇంకో సినిమా చేస్తాం. సినిమాలను మాత్రం వదలం. నేను సోలోగా సినిమా చేయాలని . ఇద్దరు హీరోయిన్స్ ను ఉండాలని స్వార్దంతో చేసిన సినిమా ఇది. 20 రోజుల క్రితమే ఈ సినిమా విడుదల కావలసింది. బెటర్ అవుట్‌పుట్ కోసం వాయిదా వేశాం. మా అంచనాలకు తగ్గట్టే సినిమా బాగా వచ్చింది. నాకు తెలిసీ ఈ సినిమాను ఎవరూ ట్రోల్ చేయరు. అంత అవకాశం, సమయం ఎవరికీ లేవు. అందువల్ల మేం సేఫ్. ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నానంటే.. కొన్ని సినిమాలను టార్గెట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు. కావాలని నెగిటివీటి క్రియేట్ చేస్తున్నారు. ఎదుటి సినిమా వాళ్లు నాశనం అయిపోవాలని చేస్తున్నారు. ఆ విమర్శలు, ట్రోలింగ్ వల్ల సినిమాను ఇష్టపడే మనమే బాధపడుతున్నాం. దయచేసి ఇలాంటి ఆలోచనలు వదిలేద్దాం. పాజిటివ్‌గా ఉంటూ ఇండస్ట్రీని కాపాడదాం’ అని అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘నేను సినిమాల్లోకి వచ్చిన 50 ఏళ్లయింది. ఈ జర్నీలో చాలా మార్పులు చూశా. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎన్నో అంశాలు దృష్టిలో ఉంచుకుని సినిమా తీయాల్సి వస్తోంది. అప్పుడు ఆడియన్స్ కోసమే సినిమాలు చేశాము. కానీ ఇప్పుడు మార్కెటింగ్ కోసం, ఓటిటి వాళ్లకి నచ్చుతుందా? హిందీ డబ్బింగ్ వారికి నచ్చుతుందా అని ఇన్ని ఆలోచించి సినిమా చేయాల్సి వస్తుంది. ఆరు నెలల్లో సినిమా తీయచ్చు.. కానీ, ఇప్పుడు మూడేళ్లు పడుతోంది. దానికి సరైన కారణం ఎవరూ చెప్పలేరు. ఇన్ని మార్పులు చూస్తూ కూడా నేను ఇండస్ట్రీ వదలకుండా సినిమాలు చేస్తున్నా. మనం ఆడియన్స్ కోసం సినిమాలు తీద్దాం. జగపతిబాబుకి సినిమా అంటే తపన, వ్యామెహం. నాకు కోపం చిరాకు వచ్చినా.. జగపతిబాబు తపన చూసి నేను సినిమా వర్క్ చేస్తున్నాను.