NTR: ఎన్టీఆర్- అనిల్ కాంబో.. మరోసారి వర్క్ అవుట్ అవుతుందా
ABN , Publish Date - Jan 16 , 2026 | 05:30 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prasanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘డ్రాగన్ (Dragon)’. ఈ సినిమా ప్రకటన వచ్చిన నాటి నుంచే బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు మొదలయ్యాయి.
NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prasanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘డ్రాగన్ (Dragon)’. ఈ సినిమా ప్రకటన వచ్చిన నాటి నుంచే బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా, తాజాగా ఒక సాలిడ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్ (Anil Kapoor) ఈ చిత్రంలో నటిస్తున్నట్లు స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
గత కొద్ది రోజులుగా అనిల్ కపూర్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ, ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘డ్రాగన్’ పోస్టర్‌ను షేర్ చేశారు. "ఒక సినిమా వచ్చేసింది.. మరో రెండు లైనప్‌లో ఉన్నాయి" అంటూ ఆయన పెట్టిన క్యాప్షన్ నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఇక ‘వార్ 2’ తర్వాత ఎన్టీఆర్‌తో అనిల్ కపూర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రెండో చిత్రం ఇది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ‘యానిమల్’ వంటి భారీ హిట్ తర్వాత, సందీప్ రెడ్డి వంగాతో పాటు మరో క్రేజీ దక్షిణాది దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. అనిల్ కపూర్ ఏ తరహా పాత్రలో కనిపిస్తారనే విషయంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో సీనియర్ నటులకు చాలా బలమైన పాత్రలు ఉంటాయి. 'కేజీఎఫ్'లో సంజయ్ దత్ రోల్ ఒక హైలైట్ అయితే, ఆయన నుంచి సరికొత్త విలనిజం చూపించారు నీల్. 'సలార్' విషయానికి వస్తే జగపతి బాబును శక్తివంతమైన పాత్రలో చూపించగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ కూడా అంతే ధీటుగా సాగింది. ఇప్పుడు 'డ్రాగన్'లో అనిల్ కపూర్ రోల్ ఎలా ఉండబోతోందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ప్రశాంత్ నీల్ స్టైల్ మాస్ యాక్షన్‌తో పాటు స్ట్రాంగ్ ఎమోషనల్ క్యారెక్టర్ల మేళవింపుగా ఉండబోతుందని సమాచారం. మొత్తానికి, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌కు తోడు అనిల్ కపూర్ లాంటి సీనియర్ స్టార్ జతకావడం ‘డ్రాగన్’ సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేసింది. ఇక ఇది చూసిన అభిమానులు వీరి కాంబో మరోసారి వర్క్ అవుట్ అవుతుందా అని కామెంట్స్ పెడుతున్నారు.