Nandamuri Balakrishna: బాలయ్య- థమన్ కాంబోకి బ్రేక్ పడిందా

ABN , Publish Date - May 02 , 2026 | 07:03 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Krishna) కెరీర్‌లో మెమరబుల్‌ మూవీ అంటే అఖండ మూవీ పేరు ముందు వరుసలో ఉంటుంది. వరుస పరాజయాలతో ఉన్న సమయంలో బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన అఖండ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.

NBK 112

Nandamuri Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో మెమరబుల్‌ మూవీ అంటే అఖండ మూవీ పేరు ముందు వరుసలో ఉంటుంది. వరుస పరాజయాలతో ఉన్న సమయంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో బాలయ్య నటన ఒక ఎత్తు అయితే, థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. ఆ సౌండ్ కి థియేటర్లలో స్పీకర్లు పగిలిపోయాయంటే అతిశయోక్తి కాదు. అప్పటి నుంచి బాలయ్య ప్రతి సినిమాకు థమన్ ఫస్ట్ ఛాయిస్ అయిపోయారు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌, అఖండ-2 ఇలా వరుసగా వీరిద్దరూ కలిసి పనిచేశారు. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రాబోతున్న NBK 111 వరకు థమనే మ్యూజిక్ అందిస్తున్నారు. బాలయ్య స్వయంగా స్టేజ్ మీద థమన్‌ను 'నందమూరి థమన్' అని పిలుచుకునేంత అనుబంధం వీరి మధ్య ఏర్పడింది. మరి ఇంతటి స్ట్రాంగ్ బాండింగ్‌కు ఇప్పుడు పడనుందనే టాక్‌ బలంగా వినిపిస్తుంది.


ఇక అసలు విషయంలోకి వస్తే.. రీసెంట్‌గా కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. యువసుధా ఆర్ట్స్ బ్యానర్‌పై సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్‌ను తీసుకోవాలని కొరటాల శివ భావిస్తున్నారట. దీనికి ప్రధాన కారణం దేవర. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమాలో అనిరుధ్ తన సంగీతంతో ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారో మనమంతా చూశాం. ముఖ్యంగా మాస్ సినిమాలకు అనిరుధ్ ఇచ్చే ఎలివేషన్ మ్యూజిక్ ఇప్పుడు ట్రెండ్ సెట్టర్‌గా మారింది.


బాలయ్య లాంటి మాస్ పల్స్ తెలిసిన హీరోకు అనిరుధ్ మ్యూజిక్ తోడైతే అది నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని కొరటాల గట్టిగా నమ్ముతున్నారు. నిజానికి థమన్‌ను మార్చడం అనేది రిస్క్ అని కొందరు అభిప్రాయపడుతుంటే, అనిరుధ్ వస్తే బాలయ్య మేనరిజమ్స్‌కు కొత్త వెరైటీ సౌండ్ దొరుకుతుందని మరికొందరు భావిస్తున్నారు. థమన్ ఆల్రెడీ బాలయ్య ఇమేజ్‌కు సరిపోయే ఒక పర్టిక్యులర్ స్టైల్ సెట్ చేసేశారు. కానీ కొరటాల శివ సినిమాల్లో మ్యూజిక్ కాస్త క్లాసీగా ఉంటూనే మాస్ ఎనర్జీని కలిగి ఉంటుంది. అందుకే ఒక కొత్త కాంబినేషన్ వైపు మేకర్స్ మొగ్గు చూపుతున్నట్లు ఫిలిం నగర్ టాక్.


గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేయబోయే సినిమా పూర్తయిన వెంటనే, కొరటాల శివ సినిమా పట్టాలెక్కనుంది. ఈ గ్యాప్‌లో మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిజంగా నందమూరి థమన్ ప్లేస్‌లోకి అనిరుధ్ వస్తే.. అది టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ కాంబినేషన్ అవుతుందనడంలో సందేహం లేదు. థమన్ మార్క్ డ్రమ్స్ బాగుంటాయా లేదా అనిరుధ్ వైబ్ బాలయ్యకు సెట్ అవుతుందా అనేది ఆసక్తికరమైన అంశం. మరి ఈ ఇద్దరిలో ఎవరు బాలయ్య కొత్త సినిమాకు మ్యూజిక్‌ అందించనున్నారో చూడాలి.

Updated Date - May 02 , 2026 | 07:34 PM