సినిమాలకు అనుష్క గుడ్ బై.. ఆ ఇంటిని కూడా అమ్మేసిన స్వీటీ

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:07 PM

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి (Anushka Shetty) సినిమాలకు గుడ్ బై చెప్తుందా అంటే నిజమే అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అప్పట్లో ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Anushka Shetty

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి (Anushka Shetty) సినిమాలకు గుడ్ బై చెప్తుందా అంటే నిజమే అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అప్పట్లో ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ముహూర్తనా ఆ సైజ్ జీరో సినిమా చేసిందో ఆ తరువాత నుంచి స్వీటీని వెండితెర మీద చూడడం తక్కువ అయ్యింది. ఎప్పుడెప్పుడు స్వీటీ సినిమాలు చేస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆమె చివరగా ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా ఆశించినంత ఫలితాన్ని అందించలేకపోయింది.


ఇక అనుష్క టాలీవుడ్ కి దూరమవుతుందని టాక్ నడుస్తోంది. అందుకు కారణం.. స్వీటీ హైదరాబాద్‌లోని తన ప్రాపర్టీని విక్రయించినట్లు తెలుస్తోంది. సాధారణంగా హీరోయిన్లు అందరూ వరుస సినిమాలు చేస్తున్న సమయంలో హైదరాబాద్ లోనే సొంత ఇల్లు కొనుగోలు చేయడం చూస్తూనే ఉంటాం. అలానే అప్పట్లో అనుష్క కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక ఇల్లుని కొనుగోలు చేసింది. ఆమె హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఆ ఇంట్లోనే ఉంటుంది. తాజాగా ఆ ఇంటినే అమ్మకానికి పెట్టిందట స్వీటీ. అయితే సడెన్ గా ఆమె ఇంటిని అమ్మడానికి కారణమేంటి అనేది ఇంకా తెలియరాలేదు.


అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం టాలీవుడ్‌లోని చాలామంది ప్రముఖులు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి హై-ఎండ్ ప్రాంతాలకు మారుతున్న నేపథ్యంలో అనుష్క కూడా అదే బాటలో వెళ్తుందేమో, అందుకే ఇక్కడ ఉంటున్న ఇంటిని అమ్మి.. అక్కడ కొత్త ఇల్లు తీసుకుంటుందేమో అని అంటున్నారు. ఇంకొందరు మాత్రం స్వీటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. అందుకే ఇక్కడ ఆస్తులను అమ్మేసి.. భర్తతో సెటిల్ అవ్వాలని చూస్తోందని చెప్పుకొస్తున్నారు. ఈ ఇల్లు కాకుండా హైదరాబాద్ శివార్లలో ఆమెకు ఒక ఫామ్‌హౌజ్ కూడా ఉంది. మరి దాన్ని కూడా విక్రయానికి పెట్టిందా.. ? కేవలం ఈ ఇల్లుని మాత్రమే అమ్మేస్తోందా అనేది తెలియాల్సి ఉంది.


మరోవైపు అనుష్క కెరీర్ పరంగా చూస్తే.. ఘాటీ చిత్రం తర్వాత ఆమె నుంచి కొత్త ప్రాజెక్ట్ ఏదీ అధికారికంగా అనౌన్స్ కాలేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం మలయాళంలో స్వీటీ కథనార్ సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. మరి నిజంగానే అనుష్క .. సినిమాలకు దూరం కావడం కోసమే ఆస్తులను అమ్మేస్తోందా..? లేక వేరే ఏదైనా కారణమా అనేది తెలియాలంటే స్వీటీ చెప్పేవరకు ఆగాల్సిందే.

Updated Date - Nov 18 , 2026 | 05:14 PM