మలయాళ మెగాస్టార్ భార్యగా రేణు దేశాయ్..
ABN , Publish Date - Nov 14 , 2026 | 10:08 PM
బద్రి సినిమాతో తెలుగుతేరకు పరిచయమైన హీరోయిన్ రేణు దేశాయ్ (Renu Desai). ఆ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ని ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆమె.. ఆ తరువాత ఆయనకు విడాకులు ఇచ్చి.. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవిస్తుంది.
బద్రి సినిమాతో తెలుగుతేరకు పరిచయమైన హీరోయిన్ రేణు దేశాయ్ (Renu Desai). ఆ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ని ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆమె.. ఆ తరువాత ఆయనకు విడాకులు ఇచ్చి.. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవిస్తుంది. ఇక కొన్నేళ్ళు ఇంటికే పరిమితమైన రేణు.. ఎట్టకేలకు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరుసగా యాడ్స్, సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇంకోపక్క జంతువుల సంరక్షణ కోసం ఎన్జీవో నడుపుతూ తన ఉదారతని చాటి చెప్తుంది. ఇక తాజాగా రేణు కోలీవుడ్ ఎంట్రీ సోషల్ మీడియాలో కొత్త చర్చలకు దారితీసింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 26 ఏళ్ల తర్వాత కోలీవుడ్ లో ఆమె రీఎంట్రీ ఇస్తుంది.
టాలెంటెడ్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ఓం(O.M: Operation Mole). రాజ్‌కుమార్ పెరిసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించింది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో రేణు ఒక్క షాట్ లో కనిపించినా కూడా హైలైట్ గా నిలిచింది. అందుతున్న సమాచారం ప్రకారం ఓం చిత్రంలో ఆమె మమ్ముట్టి భార్య పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మమ్ముట్టి ఈ చిత్రంలో బర్మా కార్తికేయన్ అనే పవర్ఫుల్ స్మగ్లర్ కమ్ పొలిటిషియన్ పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్ లో.. తల బద్దలైపోయేలా ఉంది అనే డైలాగ్ రేణు చెప్పడం చూపించారు. భర్త చేసే పనుల గురించి ఆలోచించి తలనొప్పి వస్తుంది అని రేణు పాత్ర చెప్తున్నట్లు తెలుస్తోంది.
ట్రైలర్ కన్నా ముందే రేణు.. మమ్ముట్టితో కలిసి సెట్ లో దిగిన ఫోటోలను షేర్ చేసి ఆయనపై ప్రశంసలు కురిపించింది. అంతేకాకుండా ఆమె లుక్ కూడా చాలా క్లాస్ గా రిచ్ మహిళలా కనిపిస్తుంది. దీంతో కచ్చితంగా మమ్ముట్టి భార్యగానే ఆమె కనిపిస్తోందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రంలో రేణు దేశాయ్ పాత్ర కథలో ఎంతో కీలకమని, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.ఈ సినిమా కనుక హిట్ అయితే రేణుకి తమిళ్, తెలుగులో మంచి పాత్రలు అందుతాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓం సినిమా నవంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమారేణుకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.