ర‌ష్మిక.. అప్పుడే గుడ్ న్యూస్ చెప్ప‌బోతుందా?

ABN , Publish Date - Apr 03 , 2026 | 06:49 PM

టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన జంట విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) ర‌ష్మిక (Rashmika Mandanna) గురించి మరోసారి గాసిప్స్ గుప్పుమంటున్నాయి.

rashmika

టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన జంట విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) ర‌ష్మిక (Rashmika Mandanna) గురించి మరోసారి గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఇప్ప‌టికే వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయి నెల కూడా స‌రిగ్గా గ‌డ‌వ‌ర మునుపే ఇప్పుడు మరో కొత్త వార్త సోష‌ల్ మీడియాలో పెద్ద‌ చర్చనీయాంశమైంది.

రాజస్థాన్‌లోనిఉద‌య‌పూర్‌(Udaipur) లో ఫిబ్రవరి 26న వీరి వివాహం, ఆపై హైద‌రాబాద్‌లో రిసెప్షన్ కూడా గ్రాండ్ నిర్వహించిన విష‌యం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట ప‌లుమార్లు ప‌బ్లిక్‌లో క‌నిపించి అభిమానులకు క‌నువిందు చేశారు. అంతేగాక‌ సాధారణంగా సెలబ్రిటీలు హనీమూన్‌కు వెళ్లే సమయంలో, వీరు మాత్రం సన్నిహితులతో కలిసి ‘బడ్డీ మూన్’ ట్రిప్‌కు వెళ్లి కొత్త ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టారు.

ఇదిలా ఉండగా, తాజాగా రష్మిక షేర్ చేసిన ఒక పోస్ట్ మరింత ఆసక్తిని పెంచింది. “ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం” అంటూ ఒక చిన్న యానిమేషన్ వీడియోను ఆమె పోస్ట్ చేయడంతో, నెటిజన్లు ఊహాగానాలకు తెరతీశారు. వీడియోలో విజయ్, రష్మికతో పాటు ఒక పొద్దుతిరుగుడు పువ్వు కనిపించడం, అలాగే ఆమె టీషర్ట్‌పై గుడ్డు చిత్రం ఉండటం వల్ల “గుడ్ న్యూస్ ఏమైనా ఉందా?” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతేగాక కొంత‌మంది నెల తీర‌కుండానే విరోష్ శుభ‌వార్త చెప్ప‌బోతున్నారంటూ నెటిజ‌న్లు పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు.

అయితే ర‌ష్మిక చేసిన ఈ పోస్టుకు అసలు అర్థం ఏమిటి, నిజంగా ఏదైనా శుభవార్త ఉందా అనే విషయంపై స్పష్టత రావాలంటే రష్మిక స్పందన కోసం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మాత్రం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Apr 03 , 2026 | 06:56 PM