అన్న కొడుకును మహేష్ బాబు పట్టించుకోలేదా?

ABN , Publish Date - Jul 31 , 2026 | 03:49 PM

ఒక స్టార్ కుటుంబం నుంచి వారసుడు ఇండస్ట్రీకి వస్తున్నాడు అంటే ఆ హడావిడి అంతా ఇంతా కాదు. వారసుడిని పరిచయం చేస్తూ ప్రెస్ మీట్స్, ట్రైలర్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్, కటౌట్స్.. ఇలా చాలా తతంగం ఉంటుంది.

Srinivasa Mangapuram

ఒక స్టార్ కుటుంబం నుంచి వారసుడు ఇండస్ట్రీకి వస్తున్నాడు అంటే ఆ హడావిడి అంతా ఇంతా కాదు. వారసుడిని పరిచయం చేస్తూ ప్రెస్ మీట్స్, ట్రైలర్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్, కటౌట్స్.. ఇలా చాలా తతంగం ఉంటుంది. కానీ, ఘట్టమనేని జయకృష్ణ ఎంట్రీకి ఇవేమీ లేవు. అంటే చేయలేదు అని చెప్పొచ్చు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ (Jaya Krishna Ghattamaneni) అరంగేట్రం చేసిన చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని అందుకుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంపై మొదటి నుంచి అభిమానుల్లో ఆసక్తి ఉన్నప్పటికీ, ప్రమోషన్ల లోపం తీవ్రంగా దెబ్బకొట్టింది.అందుకు కారణం సూపర్ స్టార్ మహేష్ బాబునే అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.


మహేష్ బాబు అన్న కొడుకు అయినా కూడా ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తోన్న మొదటి వారసుడు కాబట్టి ప్రచారం వేరే లెవెల్ లో ఉంటుంది అనుకునారు. కానీ, ఘట్టమనేని కాంపౌండ్ నుంచి సరైన ప్రచారం లేకపోవడంతో ఈ సినిమా సైలెంట్‌గా థియేటర్లలోకి వచ్చి మొదటిరోజే తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ వస్తాడు అని అంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరకు అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించలేదు. మహేష్ బాబు కేవలం ఒక వీడియో బైట్ రిలీజ్ చేయడం మినహా ఈ సినిమాకు ఎలాంటి మైలేజ్ ఇవ్వలేకపోయింది. కుటుంబ సభ్యులు సైతం సైలెంట్‌గా ఉండిపోవడంతో బజ్ కూడా లేదు. ప్రమోషన్స్ అస్సలు లేకపోవడంతో కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. సాధారణంగా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చే కొత్త హీరోల సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్ కంటే కూడా తక్కువ కలెక్షన్లు రావడం, దానికి తోడు టాక్ కూడా దారుణంగా వచ్చింది.


మహేష్ బాబు పట్టించుకోకపోవడం వలనే ఈ సినిమా ఇలా ఉందని టాక్. కథ, ప్రమోషన్స్ ఇలాంటివేమీ ఆయన దగ్గర ఉండి చూడలేదట. కేవలం జయకృష్ణ అడగడంతో వీడియో బైట్ అయినా ఇచ్చినట్లు సమాచారం.ఇంకోపక్క సినిమా ఫలితం ముందే ఊహించి ప్రమోషన్ల ఖర్చు తగ్గించుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతుండగా, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, బకాయిలు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయనే టాక్ ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది. నటుడిగా జయకృష్ణ, కథానాయికగా రాషా తడాని తమ ప్రయత్నంతో ప్రశంసలు అందుకున్నప్పటికీ.. పాతకాలపు కథ, బలహీనమైన దర్శకత్వం వల్ల శ్రీనివాస మంగాపురం బిగ్గెస్ట్ ప్లాప్‌గా మిగిలిపోయేలా కనిపిస్తోంది. మరి మొదటి సినిమాతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న జయకృష్ణ కెరీర్ ముందు ముందు ఎలా ఉండబోతుందో చూడాలి.

Updated Date - Jul 31 , 2026 | 04:21 PM