అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్.. అందరి చూపు అతనిపైనే

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:36 PM

ఈ ఏడాది అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూసిన విజయ్ దేవరకొండ - రశ్మిక పెళ్ళి జరిగిపోయింది. ఇక ఇప్పుడు అందరూ అల్లు వారబ్బాయి శిరీష్ (Allu Sirish) పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు.

Allu Arjun

ఈ ఏడాది అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూసిన విజయ్ దేవరకొండ - రశ్మిక పెళ్ళి జరిగిపోయింది. ఇక ఇప్పుడు అందరూ అల్లు వారబ్బాయి శిరీష్ (Allu Sirish) పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు. అల్లు అరవింద్ (Allu Aravind) మూడవ కుమారుడు అల్లు శిరీష్ మరి కొద్దిరోజుల్లో పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు. మార్చి 6 న అల్లు శిరీష్ .. నయనికా రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేయనున్నారు. అది కూడా అత్యంత సన్నిహితుల నడుమ ఈ వివాహ వేడుక జరగనుంది. దీంతో పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ పేరుతో అల్లు కుటుంబం ఒక ఈవెంట్ ను నిర్వహించింది. అల్లు స్టూడియోస్ లో ఈ వేడుక గతరాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఈ వేడుకలో పాల్గొన్నారు.

అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో అల్లు అర్జున్ హైలైట్ గా నిలిచారు. ఆయన వర్క్ చేసిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తో పాటు రాబోయే సినిమాల డైరెక్టర్స్ కూడా ఈ వేడుకలో సందడి చేశారు. ఎంతమంది వచ్చినా కూడా అభిమానులందరి చూపు కూడా ఒకరి దగ్గరే నిలిచిపోయింది. అతనే మలయాళ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో డైరెక్ట్ సినిమా చేయకపోయినా డబ్బింగ్ సినిమాల ద్వారా ఆయన తెలుగువారికి సుపరిచితమే.

ఇక కొన్ని నెలల క్రితం బాసిల్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. మిన్నల్ మురళి లాంటి సూపర్ హీరో సినిమాకు దర్శకత్వం వహించిన బాసిల్.. బన్నీతో శక్తిమాన్ లాంటి మరో సూపర్ హీరో కథను చేయడానికి సిద్ధంగా ఉన్నారని టాక్ నడిచింది. ఈ వార్తలపై బాసిల్ కూడా స్పందించారు. తాను ఈ కథపై రెండేళ్లు కష్టపడ్డానని, కానీ అది వర్కవుట్ కాలేదని తెలిపారు. దీంతో బన్నీ - బాసిల్ కాంబో ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే సడెన్ గా తమ్ముడు ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కి బాసిల్ ని బన్నీ ఆహ్వానించడం, ఆయన ఆహ్వానాన్ని మన్నించి బాసిల్ ఈ వేడుకకు హాజరుకావడం కొత్త చర్చకు దారితీసింది. వీరిద్దరి కాంబోలో శక్తిమాన్ ఓకే అయ్యిందని, అందుకే బన్నీ, బాసిల్ ని ఆహ్వానించారని నెటిజన్స్ మాట్లాడుకొంటున్నారు. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేయనున్నారని సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 03 , 2026 | 01:00 PM