చిరంజీవి.. పేరు మార్చుకున్నారా.. అసలు నిజమేంటి
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:18 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో చిరు మెగావర్స్ పేరుతో ఒక టాక్ షో ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఈ షో ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ నగరమంతటా భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో చిరు మెగావర్స్ పేరుతో ఒక టాక్ షో ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఈ షో ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ నగరమంతటా భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. అయితే, ఆ బ్యానర్లపై చిరంజీవి పేరును chira_jeevi అంటూ మధ్యలో ఒక అక్షరం వదిలేసి డిజైన్ చేయడమే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ వింత డిజైన్ చూసిన పలువురు నెటిజన్లు చిరంజీవి తన పేరును మార్చుకుంటున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారు. న్యూమరాలజీ పరంగా లేదా సెంటిమెంట్ కారణాల వల్ల పేరులో ఏదో మార్పు చేస్తున్నారేమోనని పుకార్లు పుట్టిస్తున్నారు. మరోవైపు ఈ ప్రచారంపై మెగా అభిమానులు తమదైన శైలిలో క్లారిటీ ఇస్తున్నారు. ఆ గ్యాప్‌లో వచ్చే N అంటే నెట్‌ఫ్లిక్స్ అని, ఆ ప్లాట్‌ఫామ్‌ను ప్రత్యేకంగా హైలైట్ చేయడానికే ఇలా క్రియేటివ్‌గా బ్యానర్లు వేశారని, చిరు పేరు మార్చుకోవడం లేదని ఫ్యాన్స్ బలంగా వాదిస్తున్నారు.
ప్రస్తుతం chira_jeevi బ్యానర్లపై నెట్టింట రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఫ్యాన్స్ చెబుతున్నట్లు ఇది నెట్‌ఫ్లిక్స్ క్రియేటివ్ ప్రమోషన్ స్ట్రాటజీయేనా? లేక దీని వెనుక ఇంకేమైనా సర్ప్రైజ్ దాగి ఉందా? అనేది తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్ నుంచి తదుపరి పోస్టర్ లేదా అధికారిక అప్డేట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ షోపై తెలుగు అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇండస్ట్రీ మొత్తాన్ని చిరు.. ఈ షోకి పిలిచినట్లు తెలుస్తోంది. కమల్ హాసన్, బ్రహ్మానందం, సునీల్, సూర్య ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, రవితేజ, నాని.. ఇలా స్టార్స్ అందరూ చిరుతో ముచ్చటించనున్నారు. దీంతో ఈ షో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ వస్తుందా అని అందరి అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ షోతో చిరు డిజిటల్ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.