అనుష్క.. తెలుగుకు గుడ్ బై ఇంకా

ABN , Publish Date - Sep 05 , 2026 | 08:38 PM

దశాబ్దానికి పైగా టాలీవుడ్‌లో తన నటన, సౌందర్యంతో లేడీ సూపర్ స్టార్ గా ఏకచక్రాధిపత్యం వహించిన నటి అనుష్క శెట్టి. కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన స్వీటీ .. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉండటం అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది.

Anushka Shetty

దశాబ్దానికి పైగా టాలీవుడ్‌లో తన నటన, సౌందర్యంతో లేడీ సూపర్ స్టార్ గా ఏకచక్రాధిపత్యం వహించిన నటి అనుష్క శెట్టి (Anushka Shetty). కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన స్వీటీ .. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉండటం అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్థానాన్ని సంపాదించుకున్నప్పటికీ, అనుష్క ప్రస్తుతం కొత్త సినిమాలేవీ అంగీకరించకపోవడం సినీ వర్గాల్లో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది.


సాధారణంగా చిత్ర పరిశ్రమలో క్రేజ్ ఉన్నప్పుడే వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ తమ మార్కెట్‌ను కాపాడుకోవాలని హీరోయిన్లు భావిస్తుంటారు. అయితే అనుష్క మాత్రం ఈ రొటీన్ ఫార్ములాకు పూర్తిగా మినహాయింపుగా నిలుస్తుంది. స్వీటీ ఘాటీ చిత్రం విడుదలై సరిగ్గా ఏడాది దాటిపోతున్నా, ఇప్పటివరకు ఆమె మరో కొత్త సినిమాను ప్రకటించలేదు. సాధారణంగా ఏడాదంతా వెండితెరకు దూరంగా ఉంటే అవకాశాలు తగ్గుతాయన్న భయం చాలామందిలో ఉంటుంది, కానీ స్వీటీ ఇమేజ్‌కి అలాంటి గ్యాప్స్ ఏమాత్రం ప్రతిబంధకం కావు. తలుచుకుంటే ఆమె క్షణాల్లో ఒక భారీ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లగలదు, కానీ ఆమె వైపు నుండి ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం స్వీటీ మలయాళంలో కథనార్ లో నటిస్తోంది.


ఇక వ్యక్తిగత జీవితంపై వచ్చే రూమర్లను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోని అనుష్క, ఇప్పుడు నటనకు పూర్తిగా గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నదని కూడా వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆమెకు ఇప్పటికీ నిర్మాతల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ, కొత్త కథలు రాకపోవడం లేదా పూర్తిస్థాయిలో సినిమాల నుంచివిరామం తీసుకోవాలనే ఆలోచనలో ఉండటమే ఈ సైలెన్స్‌కు కారణమని అంటున్నారు.ఇంకొందరు అయితే అనుష్క పెళ్లి చేసుకోబోతుందని చెప్పుకొస్తున్నారు. మరి అనుష్క నుంచి త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వస్తుందని, మళ్లీ ఆమె సరికొత్త అవతారంలో అలరిస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Sep 05 , 2026 | 08:43 PM