Comrade Kalyan: ఇంత ఇష్ట‌మా.. కామ్రేడ్ క‌ల్యాణ్ సెకండ్ సింగిల్ అదిరింది

ABN , Publish Date - Jul 19 , 2026 | 02:10 PM

శ్రీవిష్ణు హీరోగా తెర‌కెక్కుతున్న కొత్త చిత్రం కామ్రేడ్ క‌ల్యాణ్ నుంచి సెకండ్ సింగిల్ ఇంత ఇష్ట‌మా పాట‌ను ఆదివారం విడుద‌ల చేశారు.

Comrade Kalyan

శ్రీవిష్ణు (Sree Vishnu), మ‌ల‌యాళ బ్యూటీ మహిమ నంబియార్ (Mahima Nambiar) జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’ (Comrade Kalyan). జానకిరామ్ మారెళ్ల (Janakiram Marella) దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్‌ పిక్చర్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ 'ఒరియా పిల్లా మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకున్నాయి,

ఈ నేప‌థ్యంలో బేక‌ర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఇంత ఇష్టమా (Intha Istamaa) అంటూ సాగే ప్రేమ పాట‌ను విడుద‌ల చేశారు. విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin) సంగీతం అందించిన ఈ పాటను రామ్ మిర్యాల (Ram Miriyala), లిప్సిక (Lipsika Bhashyam) ఆల‌పించ‌గా ఆలపించారు. భాస్క‌ర‌బ‌ట్ల (Bhaskarabhatla Ravi kumar) సాహిత్యం అందించారు. ఇప్పుడు ఈ పాట విడుద‌ల అయిన కొద్ది స‌మ‌యంలోనే యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది. ఇంకెందుకు ఆల‌స్యం మారూ ఇప్పుడే ఈ పాట‌పై ఓ లుక్ వేయండి మ‌రి.

Updated Date - Jul 19 , 2026 | 02:10 PM