సినీనటి అనసూయపై అసభ్యకర కామెంట్లు.. నిందితుడి అరెస్ట్

ABN , Publish Date - Apr 21 , 2026 | 08:19 AM

సినీనటి అనసూయ (Anasuya Bharadwaj)పై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

Anasuya Bharadwaj

సినీనటి అనసూయ (Anasuya Bharadwaj)పై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సైబర్ డీసీపీ టి.సాయి మనోహర్ తెలిపిన వివ రాల ప్రకారం.. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి పలువురు వ్యక్తులు సోనల్ మీడియాలో నటి అనసూయపై అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు.

ఆమె ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు ఈ కేసులో నల్లగొండ జిల్లా అల్వాల గ్రామానికి చెందిన దొరేపల్లి చంటి(30) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 'చంటిదోరపల్లి' ఖాతా ద్వారా అతడు అభ్యంతరకర కంటెంట్‌ను ప్రచారం చేసినట్లు గుర్తించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డీసీపీ తెలిపారు.

Updated Date - Apr 21 , 2026 | 08:19 AM