ఒకవైపు ప్రభాస్.. మరోవైపు పవన్ కళ్యాణ్.. అరుదైన ఫీట్

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:30 PM

సినీ గ్లామర్ ప్రపంచంలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. కానీ కొందరి విషయంలో మాత్రం ఆ అదృష్టం తలుపు తట్టడమే కాదు. ఏకంగా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ (Imanvi) గురించి నెట్టింట జరుగుతున్న చర్చ ఇదే.

సినీ గ్లామర్ ప్రపంచంలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. కానీ కొందరి విషయంలో మాత్రం ఆ అదృష్టం తలుపు తట్టడమే కాదు. ఏకంగా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ (Imanvi) గురించి నెట్టింట జరుగుతున్న చర్చ ఇదే. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ చిన్నది.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్స్ సరసన క్రేజీ ఆఫర్లను కొల్లగొడుతోంది. అస్సలు ఎవరూ ఊహించని విధంగా మొదటి సినిమాతోనే ప్రభాస్ (Prabhas) వంటి పాన్ ఇండియా స్టార్‌తో జతకట్టడంతో పాటు, ఇపుడు మరో క్రేజీ ఆఫర్‌ను కూడా లైన్‌లో పెట్టిందని సమాచారం.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 'ఫౌజీ' (Fauji) చిత్రంతో ఇమాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. లవ్ స్టోరీలను వెండితెరపై కావ్యంలా మలిచే దర్శకుడు హను రాఘవపూడి, ఈ అమ్మడిని వెతికి పట్టుకున్నారంటేనే ఆమెలో ఏదో మ్యాజిక్ ఉందని అర్థం చేసుకోవచ్చు. 'ఫౌజీ' సినిమా ఓపెనింగ్ రోజున ఇమాన్వీ లుక్ చూసి కుర్రకారు ఫిదా అయిపోయారు. ప్రభాస్ సరసన పక్కా క్లాసిక్ బ్యూటీలా కనిపిస్తూ అందరి దృష్టిని ఇమాన్వీ ఆకర్షించింది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే.. సోషల్ మీడియాలో ఇమాన్వీ ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయింది. ఆమె చేసే ప్రతి పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. తాజాగా ఇమాన్వీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surendar Reddy) కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీకి ఒక కీలక పాత్ర లేదా హీరోయిన్‌గా ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. సమ్మర్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవైపు ప్రభాస్, మరోవైపు పవన్ కళ్యాణ్.. ఇలా ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్లతో సినిమాలు ఓకే అవ్వడం చూస్తుంటే, ఇమాన్వీ టాలీవుడ్‌లో లాంగ్ ఇన్నింగ్స్ ఆడటం ఖాయమనిపిస్తోంది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన ఇమాన్వి తన హావభావాలు, డ్యాన్స్‌తో అందరినీ కట్టిపడేసింది. కేవలం డాన్స్‌ వీడియోస్‌ కే అమ్మడికి ఫుల్‌ ఫాలోయింగ్‌ లభించింది. ఇప్పుడు నటిగా మొదటి సినిమాతోనే పాన్ ఇండియా గుర్తింపు, ఆ వెంటనే పవర్ స్టార్ సినిమాలో అవకాశం అంటే అది అరుదైన ఫీట్ అనే చెప్పాలి. మరి 'ఫౌజీ' విడుదలయ్యాక ఇమాన్వీ క్రేజ్ ఇంకెక్కడికి వెళ్తుందో చూడాలి.  మాత్రమే కాకుండా తనలోని ప్రతిభతో మరింత మంది స్టార్ హీరోల సరసన ఈ ముద్దుగుమ్మ ఛాన్సులు దక్కించుకోవాలని కోరుకుందాం.

Updated Date - Feb 10 , 2026 | 03:47 PM