SPB: బాలు కంటే వేగంగా ఎవరూ అర్థం చేసుకోలేరు...

ABN , Publish Date - Jun 05 , 2026 | 01:52 PM

గాన గంధర్వుడు, దివంగత ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి వేడుకలు గురువారం చెన్నైలో ఘనంగా జరిగాయి.

గాన గంధర్వుడు, దివంగత ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం (Singer Sp Balu) 80వ జయంతి వేడుకలు గురువారం చెన్నైలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇసైజ్ఞాని ఇళయరాజా (Ilaiyaraaja), అగ్ర నటుడు కమల్‌ హాసన్‌ (kamal Haasan) ఎస్పీబీతో ఉన్న  అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఇళయరాజా ఎక్స్‌ వేదికగా చేసిన ట్వీట్‌లో, ‘ఒక సంగీత దర్శకుడి ఆలోచన ఆయన కంటే వేగంగా ఎవరూ అర్థం చేసుకోలేరు. ఒక పాటపై ఆయన కంటే ఎక్కువ ఏకాగ్రతను ఎవరూ పెట్టలేరు. ఆయన జీవితాన్ని, స్నేహాన్ని, 50 వేల పాటల అద్వితీయమైన ఘనతను స్మరించుకుందాం. హ్యాపీ బర్త్‌డే ఎస్పీబీ’ అంటూ పేర్కొన్నారు. 

అలాగే, అగ్ర నటుడు కమల్‌ చేసిన ట్వీట్‌లో ‘ఈ రోజు నేను పట్టుకున్న వేలు, నా సంగీత స్వరం అయిన ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం పుట్టిన రోజు. ఒక స్వరంగా ఆయన చిరకాలం వర్థిల్లుగాక’ అని పేర్కొంటూ ఎస్పీతో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. 


ఎస్పీ బాలు జయంతిని పురస్కరించుకుని నెల్లూరు  మినీబైపాస్ రోడ్డులో గల ఎన్టీఆర్ పార్క్, అన్నమయ్య కూడలి వద్ద గాన గంధర్వుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై.. ఎస్.పి. బాలు (SP Balu) కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ‘స్వరనీరాజనం - మన బాలుకి సుస్వరహారతి’ పేరుతో ప్రత్యేక సంగీతార్చన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. 

ALSO READ: Naga Chaitanya: 'దూత' సెకండ్‌ సీజన్ షూటింగ్‌ షురూ!

రామ్ చరణ్ మాస్ రాంపేజ్.. తొలి రోజే సెంచరీ దాటిన 'పెద్ది'



Updated Date - Jun 05 , 2026 | 02:22 PM