సీరియస్ అనుకుంటే సర్‌ప్రైజ్ అవుతారు.. ఇడుపు కాయితంలో అసలు మ్యాటర్ ఇదే!

ABN , Publish Date - Nov 29 , 2026 | 02:15 PM

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటించిన తాజా చిత్రం 'ఇడుపు కాయితం' ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Idupu Kayitham

ఇడుపు కాయితం (Idupu Kayitham) అనేది చాలా సీరియస్ సబ్జెక్ట్ ఉన్న సినిమా అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇందులో మీ అందరికీ కావాల్సినంత వినోదం ఉంటుంది. హీరోహీరోయిన్ ప్రియదర్శి (Priyadarshi Pulikonda), నాగదుర్గ (Naga Durga) ఒకరితో ఒకరు పోటీపడి నటించారు. ఈ చిత్రం చూసిన తర్వాత థియేటర్ నుంచి హ్యాపీగా బయటకు వస్తారు' అని బన్నీ వాస్ (Bunny Vas) అన్నారు.

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా వంశీరెడ్డి దొండపాటి తెరకెక్కించిన చిత్రం 'ఇడుపు కాయితం'. బన్నీవాస్, తబిత సుకుమార్ నిర్మించారు. డిసెంబరు 11న చిత్రం విడుదలవుతున్న సందర్భంగా సినిమా నుంచి 'ఉల్లిపూల' అనే పాటను రిలీజ్ చేశారు.

ప్రియదర్శి మాట్లాడుతూ 'ఒక అమ్మాయి ప్రేమలో ఉంటే ఎంత బాగుంటుందో చెప్పే సాంగ్ ఇది. ఆ భావాలను అభినవ్ శ్రీనివాస్ అద్భుతంగా రాశారు' అని చెప్పారు. వంశీ దొండపాటి మాట్లాడుతూ 'అబ్బాయి, అమ్మాయి తరపున ఉండే కుటుంబాలు కలిసి ఈ సినిమా చూస్తే వారి బంధం మరింత బలపడుతుంది. మా సినిమా చూశాక చెమర్చిన కళ్లతో బయటకు వస్తారు' అని తెలిపారు.

Updated Date - Nov 29 , 2026 | 02:29 PM