ట్రోలర్స్ కి నవ్వుతూనే గట్టి కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

ABN , Publish Date - Jul 28 , 2026 | 03:22 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా చేస్తున్న బన్నీ.. దీని తరువాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా చేస్తున్న బన్నీ.. దీని తరువాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక కొంచెం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్తున్నాడు. తాజాగా వెకేషన్ నుంచి వచ్చిన బన్నీ వెంటనే ఫ్యాన్ మీట్ ని ఏర్పాటు చేసి అభిమానులను కలుసుకున్నాడు. ఆ ఈవెంట్ లో బన్నీ ట్రోలర్లు, నెగెటివిటీ వ్యాప్తి చేసే వారికి అత్యంత ఆసక్తికరమైన, ఘాటు సందేశాన్ని ఇచ్చాడు. సాధారణంగా తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బన్నీ, ఈసారి తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ట్రోలింగ్ చేసే వారిఉద్దేశాన్ని ప్రశ్నిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.


నెగెటివిటీపై సమయాన్ని వృథా చేసుకునే బదులు, జీవితంలో సంతోషాన్ని ఇచ్చే పనులపై దృష్టి పెట్టాలని బన్నీ చెప్పుకొచ్చాడు. 'మీకు నచ్చని వారిపై ఫోకస్ పెట్టి వారిని ట్రోల్ చేసి అనవసరంగా మీ టైమ్, మనీ, ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. మీకు నచ్చలేదా.. వదిలేయండి. మీ దగ్గర వంద రూపాయలు ఉంటే.. మీకు ఇష్టం లేని వాటిమీద ఖర్చుపెడతారా.. పెట్టరు కదా.. వదిలేయండి. మీకు నచ్చిన పని చేసుకోండి. కావాలంటే మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు నిలబడి ఎంజాయ్ చేయండి .. అట్లీస్ట్ మీరు హ్యాపీగా ఉంటారు" అంటూ తనదైన శైలిలో చమత్కరిస్తూనే గట్టి హితవు పలికాడు.


ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. బన్నీ చెప్పిన మాటల్లో ఎంతో నిజం ఉందని ఆయన అభిమానులు సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం ఈ తరహా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ట్రోలింగ్ కల్చర్‌పై అల్లు అర్జున్ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Updated Date - Jul 28 , 2026 | 03:23 PM