Allu Arjun: మమ్ముట్టి కొడుకు.. అయినా గర్వం ఉండదు
ABN , Publish Date - Nov 15 , 2026 | 10:16 PM
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), సాత్విక వీరవల్లి జంటగా పవన్ సాధినేని దర్శకత్వం వహించిన చిత్రం ఆకాశంలో ఒక తార(Aakasamlo Oka Tara).
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), సాత్విక వీరవల్లి జంటగా పవన్ సాధినేని దర్శకత్వం వహించిన చిత్రం ఆకాశంలో ఒక తార(Aakasamlo Oka Tara). గీత ఆర్ట్స్, స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ మీడియా బ్యానర్స్ పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ చిత్రంలో అందాల భామ శృతి హాసన్ ఒక ప్రత్యేక పాత్రలో మెరిసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నవంబర్ 20 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు.
ఇక ఈ స్టేజ్ పై బన్నీ మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. అందరి ఫ్యాన్స్ కి హాయ్. ముఖ్యంగా దుల్కర్ లేడీ ఫ్యాన్స్ కి హాయ్. ముందుగా నాకు దుల్కర్ సల్మాన్ అంటే చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ సినిమా మలయాళంలో చూశాను. అక్కడి నుంచి ఆయన గ్రాఫ్ ఎలా పెరిగిందో చూశాను. మలయాళం నుంచి తమిళంలో మణిరత్నం గారిలాంటి గొప్ప డైరెక్టర్స్‌తో చేశారు, ఆ తర్వాత తెలుగులోకి వచ్చి మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి వండర్ఫుల్ ఫిల్మ్స్ చేశాడు. ఆ హిట్ లిస్ట్ అలా కొనసాగుతూనే ఉంది. ఆయన మూవీస్ సెలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా వెర్సటైల్ యాక్టర్, అలాగే చాలా స్వీట్ పర్సన్. నాకు ఆయనతో పెద్దగా పరిచయం లేదు కానీ, ఎప్పుడూ చూసినా మనకు ఎప్పటినుంచో తెలిసిన వ్యక్తిలా అనిపిస్తాడు.
మీ అందరికీ తెలుసు.. ఆయన స్టార్ హీరో మమ్ముట్టీ కొడుకు అని, స్టార్ కిడ్ అయినప్పటికీ ఆ స్టార్ ప్రెజెన్స్ ఎప్పుడూ ఫీల్ కానివ్వడు. అందరితో చాలా లైట్‌గా, హంబుల్‌గా ఉంటాడు. ఆ మంచి క్వాలిటీనే ఆయనకు అంత ఇమేజ్, సక్సెస్ తెచ్చిపెడుతోంది. దుల్కర్.. నువ్వు ఇలాగే ఇంకా చాలా దూరం వెళ్తావ్. ఇంకా నీ నుంచి ఎక్కువ సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. కేవలం నటుడే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా సినిమాలు చేస్తున్నాడు, లోకా లాంటి వండర్ఫుల్ ఫిలింలో చిన్న కేమియో కూడా చేశాడు. సినిమాలపై ఆయనకున్న ప్యాషన్ చాలా గొప్పది. మలయాళం హీరోల్లో తెలుగులో సుమగారితో పాటు ఎక్కువగా ఇష్టపడే వాళ్లలో దుల్కర్ కూడా ఒకరు.
ఇక ఈ సినిమాతో వస్తోన్న కొత్తమ్మాయి సాత్వికకి ఆల్ ది బెస్ట్. ఇండస్ట్రీలో ఇంతమంది స్టార్స్‌తో కూడిన సినిమాతో లాంచ్ అవ్వడం అనేది ఎవరికైనా ఒక డ్రీమ్ లాంచ్ అవుతుంది. తెలుగు అండ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి మీకు స్వాగతం, గ్రేట్ కెరీర్ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే శృతి హాసన్.. కమర్షియల్ స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా ఇలాంటి ఒక స్పెషల్ రోల్ చేసి, ఈ సినిమాను సపోర్ట్ చేయడం చాలా నచ్చింది. ఇక రుహానీ నాకు యాక్టర్‌గా చాలా ఇష్టం, మంచి ప్రెజెన్స్ ఉన్న నటి. అలాగే టెక్నీషియన్స్ అందరికీ, కెమెరామెన్‌కి ఆల్ ది బెస్ట్. జి.వి. ప్రకాష్ కుమార్.. ఎన్ని హిట్లు ఇస్తారు సర్? ఈ ఇయర్ మీదే నడుస్తోంది. లక్కీ భాస్కర్ తర్వాత ఈ సినిమాతో కూడా మరో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్నాను. దర్శకుడు పవన్ సాధినేని గురించి చెప్పాలంటే.. ఆయన చాలా టాలెంటెడ్ డైరెక్టర్, ఇప్పటికీ తనకి రావాల్సిన సాలిడ్ సక్సెస్ ఇంకా రాలేదని నేను ఫీలవుతుంటాను. డెఫినెట్‌గా ఈ సినిమాతో ఆ డ్యూ తీరిపోతుంది.
ఇక ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే.. ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తున్న మా నాన్న అల్లు అరవింద్ గారు, అలాగే స్వప్న సినిమాస్ ద్వారా స్వప్నగారు, ప్రియాంకగారు.. ఇలా సెకండ్ జనరేషన్ నిర్మాతలు లెగసీని ముందుకు తీసుకెళ్తూ, గ్రేట్ కంటెంట్, భారీ స్కేల్‌తో సినిమాలు చేస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. వాళ్ల జర్నీ చాలా పెద్దది..వారిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. మా నాన్నగారు ఈ సినిమా గురించి చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. ఇదొక మంచి సైన్. టీజర్ చూసినప్పుడే నాకూ ఆ వైబ్, ఆ సినిమాలోని సోల్ కనిపిచింది. ఈ సినిమా టీమ్‌కి, రైటర్స్‌కి అందరికీ అభినందనలు. ఈ సినిమా కోర్ పాయింట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది.. ప్రతి ఒక్క మహిళ కల నెరవేరేలా చేయడం అనే పాయింట్ చాలా బాగుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను'అని తెలిపాడు.