ఫ్యామిలీ వెకేషన్ లో 'రాకా'..

ABN , Publish Date - May 26 , 2026 | 07:05 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం రాకా (Raaka) సినిమాతో బిజీగా మారాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది.

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం రాకా (Raaka) సినిమాతో బిజీగా మారాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. దీపికాతో పాటు మరో ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రానికి బన్నీ బ్రేక్ వేశాడు. ఇటీవలే ఒక భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న బన్నీ, ఈ గ్యాప్‌లో రీఫ్రెష్ అవ్వడానికి వెకేషన్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది.


సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబానికి కేటాయించే విషయంలో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ క్రమంలోనే సమ్మర్ వెకేషన్‌ను ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్ వెళ్ళినట్లు సమాచారం. దాదాపు రెండు వారాల పాటు ఈ ట్రిప్ కొనసాగనుందట. వెకేషన్ ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాతే ఆయన తన తదుపరి షెడ్యూల్స్ ని మొదలుపెట్టనున్నాడు.


ఇక బన్నీ సమ్మర్ ట్రిప్ వెనుక కూడా ఆపెద్ద కారణమే ఉందని టాక్. అదేంటంటే.. ఇప్పటివరకు చిన్న చిన్న షెడ్యూల్స్ పూర్తిచేసుకున్నఅల్లు అర్జున్ .. ఇక నుంచి లాంగ్ షెడ్యూలోకి అడుగుపెడుతున్నాడట. ఈ షెడ్యూల్స్ సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. అప్పుడు బ్రేక్ తీసుకోవడం కష్టం కాబట్టి.. ముందే ఈ ట్రిప్ ని ప్లాన్ చేసినట్లు సమాచారం. మరి రాకాతో బన్నీ ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.

Updated Date - May 26 , 2026 | 07:24 PM