Jaya Krishna: నటుడిగా.. నిరూపించుకుంటా

ABN , Publish Date - Jul 27 , 2026 | 07:29 AM

జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ జంటగా అజయ్‌ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ 30న విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది.

Jai Krishna

సూపర్‌ స్టార్‌ కృష్ణ (Krishna) మనవడు, మహేశ్‌ బాబు (Mahesh Babu) ర‌మేశ్ బాబుఅన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని (Jai Krishna Ghattamaneni), రాషా తడానీ (Rasha Thadani) జంటగా అజయ్‌ భూపతి (Ajay Bhupathi) తెరకెక్కించిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). సీనియర్‌ నటుడు మోహన్‌బాబు (Mohan Babu) పవర్‌ఫుల్‌ పాత్రను పోషిస్తున్నారు. పి.కిరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీదత్ (Ashwini Dutt) సమర్పిస్తున్నారు. సినిమా ఈనెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది.

ఈ సంద‌ర్భంగా జై కృష్ణ ఘట్టమనేని మాట్లాడుతూ ‘ఈ సినిమాలో దర్శకుడు అజయ్‌ రాసుకున్న పాత్రలు, భావోద్వేగాలు ఎంతో వాస్తవికంగా ఉంటాయి. ప్రేక్షకులు ఈ సినిమాకి బాగా కనెక్ట్‌ అవుతారు. సినిమా అంతా చాలా మంచి ఫ్లోలో సాగుతుంది. ప్రేక్షకులకు నేను మొదటి సారి పరిచయం అవుతున్న ఈ సందర్భంలో ఇంత మంచి కథతో నన్ను నేను నిరూపించుకోవచ్చని అనిపించింది. నన్ను నేను నటుడిగా నిరూపించుకోవడం నా ప్రథమ లక్ష్యం. మంచి సినిమాలు చేసే నటుడిగా ఉండాలనేది నా కోరిక’ అని అన్నారు.

దర్శకుడు అజయ్‌ భూపతి మాట్లాడుతూ ‘మహేశ్‌ బాబు లా జై కృష్ణ కూడా ఇండస్ట్రీలో ఎప్పటికీ ఉండిపోయే హీరో అవుతారు. నేను అనుకున్నట్టే సినిమా గొప్పగా వచ్చింది’ అని అన్నారు. సీనియర్‌ నటుడు నరేశ్‌ విజయకృష్ణ మాట్లాడుతూ ‘జై కృష్ణ హీరోగా పరిచయం అవుతుండడం చాలా సంతోషంగా అనిపించింది. తను కృష్ణగారి వారసత్వాన్ని బాధ్యతగా తీసుకుంటున్నాడు. అశ్వినీదత్‌ ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు. ఈ సినిమాను ఆయన సమర్పించడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. కార్యక్రమంలో నటులు బ్రహ్మాజీ, వడ్లమాని శ్రీనివాస్‌, డీఓపీ జై కృష్ణ మాట్లాడారు.

Updated Date - Jul 27 , 2026 | 07:39 AM