Naveen Poli: ప్రభాస్‌ పెళ్లి అయిన తర్వాతి రోజే..

ABN , Publish Date - Jan 02 , 2026 | 02:10 PM

తన పెళ్లిపై నటుడు నవీన్‌ పోలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ప్రచార కార్యక్రమల్లో పాల్గొన్న ఆయన పెళ్లి గురించి మాట్లాడారు. ‘


తన పెళ్లిపై నటుడు నవీన్‌ పోలిశెట్టి (Naveen polishtty) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga ok raju) చిత్రం ప్రచార కార్యక్రమల్లో పాల్గొన్న ఆయన పెళ్లి గురించి మాట్లాడారు. ‘ప్రభాస్‌ ((Prabhas) అన్నయ్య పెళ్లి చేసుకున్న తర్వాతి రోజు 12 గంటలకు నేను పెళ్లి చేసుకుంటా’ అని ఆయన అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షి చౌదరి కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా నవీన్‌, మీనాక్షి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు నవీన్‌ సమాధానమిచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నేను ప్రభాస్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. మా మధ్య పోటీ ఉండదు. సంక్రాంతి సినిమాల్లో నేనైతే ఫస్ట్‌ ప్రభాస్‌గారి సినిమా చూసి, తర్వాత చిరంజీవి గారి సినిమాకి వెళ్లి.. అటునుంచి నా సినిమాకు వెళ్తా. ఒక్కే రోజులో 6 సినిమాలు చూసిన రోజులున్నాయి.


నాకు బాట వేసింది ఆయనే..

‘అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో రూమ్‌ రెంట్‌, ఇతర అవసరాల కోసం ముంబయిలో పెళ్లి సంగీత్‌లకు హోస్ట్‌గా పనిచేశా. మా ఫ్యామిలీలో ఏ పెళ్లి జరిగినా వాటి సంగీత్‌, రిసెప్షన్‌ నాతోనే హోస్ట్‌ చేయించేవాళ్లు. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల హోస్ట్‌ చేయడం లేదు. మెగాస్టార్‌ చిరంజీవి గారిని చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందారు. సగటు మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా తెలుగు ఇండస్ర్టీలో స్టార్‌ అవ్వవచ్చని పలువురికి దారి చూపించిన వ్యక్తాయన. నాలాంటి ఎంతోమందికి బాట వేసింది ఆయనే. అలాంటి గురువుగారి సినిమా వస్తుందంటే, ఒత్తిడి ఉండదు. ఉత్సాహం ఉంటుంది. ఈ సంక్రాంతికి మంచి సినిమాలున్నాయి.  

 

Updated Date - Jan 02 , 2026 | 02:10 PM