వాళ్లు.. చేయలేనివి నేను చేస్తా

ABN , Publish Date - Sep 05 , 2026 | 06:17 AM

నిర్మాతల సంఘం సభ్యుల సంక్షేమం కోసం గట్టిగా కృషి చేస్తానని నిర్మాత నట్టికుమార్ తెలిపారు.

natti kumar

నిర్మాతల సంఘం సభ్యుల సంక్షేమం కోసం గట్టిగా కృషి చేస్తానని నిర్మాత నట్టికుమార్ (Natti Kumar) తెలిపారు. ఇండిపెండెంట్‌గా నట్టికుమార్‌ ట్రెజరర్‌ పోస్టుకు పోటీ చేస్తున్నారు. ఆయన తనయుడు నట్టి క్రాంతి ఈసీ మెంబర్‌గా బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో నట్టికుమార్‌ మాట్లాడుతూ ‘కౌన్సిల్‌ ఎన్నికల్లో రెండు ప్యానల్స్‌ పోటీలో ఉన్నాయి. నేను గెలిస్తే.. ఆ ప్యానల్స్‌ వాళ్లు చేయలేని పనులను కూడా చేసి చూపిస్తాను.


సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేటప్పుడు అందరినీ సమదృష్టితో చూస్తా. రూ.10లక్షల మెడిక్లెయిమ్‌ పాలసీని అమల్లోకి తీసుకొస్తా. ఐదు వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వడానికి కృషి చేస్తా. దాసరి శిష్యుడిగా, చిరంజీవి (Chiranjeevi) అభిమానిగా నేనెప్పుడూ తప్పు చేయను. నిర్మాతల సంక్షేమం కోసం గెలుపోటములకు అతీతంగా పనిచేస్తాను’.. గిల్డ్ వారిని బండ్ల గణేష్ నమ్మించి మోసం చేశాడని తెలిపారు.

Updated Date - Sep 05 , 2026 | 06:17 AM