సినిమాల్లోకి.. కొత్త తెలుగు అందం! ఫెమీనా మిస్ ఇండియా సౌత్ విజేత ఇందు
ABN , Publish Date - Apr 24 , 2026 | 06:50 AM
ఫెమీనా మిస్ ఇండియా సౌత్ 2026 విజేత ఇందు ఫల్గుణి తాజాగా పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు.
సినిమాలలో నటిస్తానని, ప్రస్తుతం న్యాయవిద్య అభ్యసిస్తుండగా భవి వ్యత్తులో న్యాయమూర్తిగా కావాలన్నదే తన లక్ష్యమని ఫెమీనా మిస్ ఇండియా సౌత్ 2026 (Femina Miss India) కిరీట విజేత చిలకల పూడి ఇందు ఫల్గుణి (Chilakalapudi Indu Falguni) అన్నారు. సోమాజిగూడ ప్రెస్ కబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె తన అను భవాలను పంచుకున్నారు.
తమది ఆంధ్రప్రదేశ్ గుంటూరు పట్టణం అరండల్ పేట అని, తాను మాత్రం హైదరాబాద్‌లో జన్మించానని, ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నామని తెలిపారు. పది సంవత్సరాల క్రితం అన్నపూర్ణ స్టూడియోలో యాడ్ మాటింగ్లో పాల్గొన్నానని, అప్పటి నుంచి ఫ్యాషన్, సినిమా రంగంపై మక్కువ పెరిగిందని చెప్పారు.
గత జనవరిలో ముంబైలో ఫెమీనా మిస్ ఇండియా ఆడిషన్స్ జరుగగా తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పాల్గొన్నానని, ఈ నెల 18న భువనేశ్వర్‌లో జరిగిన ఫైనల్స్‌లో కిరీటం గెలుచుకున్నానని తెలిపారు. నా వల్ల కాదు, నేను ఏమీ చేయలేను అని నిరుత్సాహపడే యువతను మోటివేట్ చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో ఆమె తండ్రి మహేష్ చిలకలపూడి పాల్గొన్నారు.