Varun Tej: నేను నా వైఫ్‌తో కన్నా.. తమన్‌తోనే ఎక్కువ గడిపా
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:04 AM
భీమవరంలో జరిగిన కొరియన్ కనకరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ రితికా నాయక్, సంగీత దర్శకుడు తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) సినిమాతో మీకు ఆద్యంతం వినోదం పంచబోతున్నా. 2018లో ‘తొలిప్రేమ’ (Toliprema) చిత్రం ఈవెంట్ కోసం ఇక్కడకు వచ్చాను. మళ్లీ ఇన్నాళ్లకు ‘కొరియన్ కనకరాజు’ వేడుకును మీ అందరి సమక్షంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మీ అందరి ఉత్సాహం చూస్తుంటే మళ్లీ ‘తొలిప్రేమ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అనిపిస్తోంది. నన్ను ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించారు. ఇంకా చెప్పాలంటే.. నేను ఈ సినిమా సమయంలో నా వైఫ్‌తో కన్నా తమన్ తోనే ఎక్కువ గడిపానని, ఈ చిత్రం OG ,పెద్ది రేంజ్ కాకపోయినా నా రేంజ్‌లో ఉంటుంది అని అన్నారు. మీరు గర్వపడే సినిమా ఇది. సినిమాను ప్రేమించే ప్రతీ ఒక్కరు కుటుంబంతో కలసి థియేటర్‌లో చూడాలని కోరుతున్నా’ అని అన్నారు హీరో వరుణ్ తేజ్ (Varun Tej).
ఆయన, రితికా నాయక్ (Ritika Nayak) జంటగా మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) తెరకెక్కించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ సంస్థలు నిర్మించాయి. సినిమా ఈనెల 7వ తేదీన విడుదలవుతున్న సందర్భంగా భీమవరంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా రితికా నాయక్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను చేసిన ‘చైత్ర’ పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ ‘గాంధీ చాలా మంచి విజన్‌తో ఈ సినిమా తీశారు. చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. కార్యక్రమంలో మంతెన రామరాజు, నిశాంత్, నల్గొండ గద్దర్ పాల్గొన్నారు.