'కొరియన్ కనకరాజు' కోసం.. కొరియన్ భాష నేర్చుకున్నా: వరుణ్ తేజ్

ABN , Publish Date - Aug 07 , 2026 | 08:59 AM

‘కొరియన్‌ కనకరాజు’ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్‌ ఉన్న పాత్రను పోషించే అవకాశం రావడం ఓ నటుడిగా చాలా సంతృప్తినిచ్చింది అని హీరో వరుణ్‌తేజ్ అన్నారు.

Korean Kanakaraju

‘కొరియన్‌ కనకరాజు’ (Korean Kanakaraju) సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్‌ ఉన్న పాత్రను పోషించే అవకాశం రావడం ఓ నటుడిగా చాలా సంతృప్తినిచ్చింది అని హీరో వరుణ్‌తేజ్ (Varun Tej) అన్నారు. ఆయన కథానాయకుడిగా మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) తెరకెక్కించిన చిత్రమిది. యూవీ ప్రొడక్షన్స్‌, ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్టైన్‌మెంట్స్‌ నిర్మించాయి.

నేడు సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు వరుణ్‌తేజ్‌. ‘కామెడీకి స్కోప్‌ ఉన్న చిత్రాలను చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను.. ఆ సమయంలో గాంధీ చెప్పిన ఈ కథలోని వినోదం, వైవిధ్యం నాకు నచ్చడంతో వెంటనే ఓకే చేశా. మొదటి సన్నివేశం నుంచి ముగింపు వరకూ ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. ఇందులో నేను పోషించిన పాత్రలు నటుడిగా నాకు సవాల్‌ విసిరాయి. ఈ రోల్‌ కోసం రాయలసీయ యాసతో పాటు కొరియన్‌ భాష కూడా నేర్చుకున్నా.

మేర్లపాక గాంధీ విజన్‌, టేకింగ్‌ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. రితికా నాయక్ (Ritika Nayak), సత్య పాత్రలు కథలో కీలకంగా ఉంటాయి. తమన్‌ ఇచ్చిన పాటలు ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి. థియేటర్‌లో చూసినప్పుడు విజువల్‌గా మరింత గొప్ప అనుభూతిని ఇస్తాయి. సినిమా అవుట్‌పుట్‌ చూశాను. చాలా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఇందులో ఫన్‌తో పాటు యాక్షన్‌ సన్నివేశాలు కూడా అందర్నీ అలరిస్తాయి. ప్రస్తుతం చేస్తున్న ‘బరి’ పూర్తిగా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రా్‌పలో సాగుతుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది’ అని చెప్పారు.

Updated Date - Aug 07 , 2026 | 09:43 AM