Hyper Aadi: పవన్ కళ్యాణ్ కి సపోర్ట్.. బిల్డింగ్ పై నుంచి తోసేస్తానన్నారు

ABN , Publish Date - Jan 03 , 2026 | 02:56 PM

జబర్దస్త్ నటుడు, కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఒకపక్క కమెడియన్ గా చేస్తూనే ఇంకోపక్క డైలాగ్ రైటర్ గా బిజీగా మారాడు.

Hyper Aadi

Hyper Aadi: జబర్దస్త్ నటుడు, కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఒకపక్క కమెడియన్ గా చేస్తూనే ఇంకోపక్క డైలాగ్ రైటర్ గా బిజీగా మారాడు. ఇక ఆది సినిమాల గురించి పక్కన పెడితే.. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి వీరాభిమాని.. అభిమాని అనడం కన్నా భక్తుడు అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాకా ఆయన అభిమానులే ఆయనను దూరం పెట్టారు. ఎందుకు రాజకీయాలు సినిమాలు చేసుకోక అంటూ కామెంట్స్ చేశారు. కానీ, పవన్ భక్తులు మాత్రం పవన్ కి సపోర్ట్ గా నిలబడ్డారు. అందులో ఆది కూడా ఒకడు.

ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మారడానికి పరోక్షంగా హైపర్ ఆది కూడా కారణమే అని చెప్పాలి. ఎన్నికల ప్రచారం ఆది.. పవన్ కి సపోర్ట్ గా ఎంతో తిరిగాడు. వేరేవారిని విమర్శిస్తూ.. పవన్ గొప్పతనాన్ని వివరించాడు. తనదైన పంచ్ లతో ఎంతోమందిమీ పవన్ కి ఓటు వేసేలా చేయగలిగాడు. అయితే తాను ఇండస్ట్రీకి రాకముందు నుంచే పవన్ కి పెద్ద ఫ్యాన్ అని.. ఆయనను కాలేజ్ రోజుల్లోనే సపోర్ట్ చేసేవాడిని అని, దానివలన తనకు చాలా బెదిరింపులు కూడా వచ్చాయని ఒక పాడ్ క్యాస్ట్ లో చెప్పుకొచ్చాడు.

జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న ఒక పాడ్ క్యాస్ట్ లో పాల్గొన్న ఆది.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. 'పాలిటిక్స్ అన్నప్పుడే నెగిటివిటీ ఉంటుంది. నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో ఇవతల పక్క నేను పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మాట్లాడానని ఒక పదిమంది సీనియర్లు నన్ను పైకి తీసుకెళ్లి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నిన్ను బిల్డింగ్ ప నుంచి తోసేస్తామని బెదిరించారు. ఇలాంటి బెదిరింపులు ఆరోజుల్లోనే ఉండేవి. నేను నమ్మిన నాయకుడు అసలు జనాభా లెక్కలో ఒకడు కాదు. లెక్కలేనంత జనాభాకు ఒకే ఒక్కడు' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Jan 03 , 2026 | 03:10 PM