Fahadh Faasil: హైదరాబాద్.. నాకు చాలా ప్రత్యేకమైనది
ABN , Publish Date - Sep 30 , 2026 | 07:16 AM
నేను ఇష్టపడే నటుల్లో ప్రథముడు ఫహాద్ ఫాజిల్. దేశం గర్వించదగిన గొప్ప నటుడు ఆయన' అని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
'నేను ఇష్టపడే నటుల్లో ప్రథముడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil). దేశం గర్వించదగిన గొప్ప నటుడు ఆయన' అని హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NT R) అన్నారు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో శశాంక్ యేలేటి దర్శ కత్వంలో నటించిన చిత్రం 'డోంట్ ట్రబుల్ ట్రబుల్ (Don't Trouble The Trouble). శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించారు. అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సంద ర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ 'గాయం నుంచి కోలుకున్నాను. ఎట్టిపరిస్థితుల్లోనూ 'డ్రాగన్' చెప్పిన సమయానికే జూన్ 11న విడుదలవుతుంది' అని చెప్పారు. ప్రత్యేక అతిథి, దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ 'ఈ సినిమా ఘనవిజయం సాధించాలి' అని ఆకాంక్షించారు.
దర్శకుడు ఎస్. ఎస్.రాజమౌళి (S. S. Rajamouli) మాట్లాడుతూ 'నేను ఫహాద్ ఫాజిలికి పెద్ద అభిమానిని. ఈ చిత్ర కథను ఒక్క ముక్కలో చెప్పమని శశాంక్ని అడిగితే, దయ్యాన్ని కిడ్నాప్ చేసిన మనిషి కథ అని చెప్పాడు. అది విన్న వెంటనే షాక్ కు గురయ్యాను' అని అన్నారు.
ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ తెలుగు ప్రజలు నాపై చూపిస్తున్న అభిమానాన్ని ఎక్కడా చూడలేదు. హైదరాబాద్ నాకు చాలా ప్రత్యేకమైనది' అని అన్నారు. కార్యక్రమంలో నిర్మాతలు ఎస్.ఎస్.కార్తికేయ, శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, దిల్ రాజు, డా. కేఎల్ నారాయణ, నవీన్ యెర్నేని, రవిశంకర్, బాలనటి సారా తదితరులు పాల్గొన్నారు.