యువకులు, తల్లిదండ్రులు.. విడివిడిగా చూడాల్సిన సినిమా 'హుషారు పిట్టలు'

ABN , Publish Date - Feb 12 , 2026 | 10:43 AM

అన్షు, వాసవి గణేశ‌న్‌ జంటగా రూపొందిన‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం హుషారు పిట్టలు.

husharu pittalu

అన్షు, వాసవి గణేశ‌న్‌ జంటగా రూపొందిన‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం హుషారు పిట్టలు (Hushar Pittalu). పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించిన‌ ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. కాగా తాజాగా ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేసి మాట్లాడుతూ.. నిర్మాత బెక్కం వేణుగోపాల్ హుషారు పిట్టలు సినిమా గురించి చెప్పాడు. సినిమా చూడగానే వెరీ రియలిస్టిక్‌ యంగ్‌స్టర్‌ సినిమా అనిపించింది. నేటి యువతరం కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. సినిమాలో నటీనటులు అందరూ బాగా చేశారు. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది' అన్నారు.

దర్శకుడు బిక్షు మాట్లాడుతూ.. 16 సంవత్సరాలు కష్టపడి ఈ స్టేజ్‌కు వచ్చాను. ఈ రోజు దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. నా దర్శకత్వంలో వచ్చిన సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ అండ్‌ ఏషియన్‌ ఫిలింస్‌ వారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. సినిమా గురించి ఏమీ తెలియని నేను అన్ని నేర్చుకుని ఓ సినిమాకు దర్శకత్వం వహించడం ఆశ్చర్యంగా ఉంది. ఈ సినిమా యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు విడి విడిగా చూడాల్సిన కుటుంబ కథా చిత్రం. తప్పకుండా నేటి యువతకు హుషారు తెప్పిచే చిత్రం ఇది. నా రియల్ లైఫ్‌లో నా చుట్టుప్రక్కల జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాను. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా చూసిన తరువాత అందరూ థ్రిల్ల్‌ అయ్యి షాక్‌ అయ్యి ఔట్‌ అవుతారు' అన్నారు.

ప్రముఖ నిర్మాత బెక్కం వేణగోపాల్‌ మాట్లాడుతూ.. సైలెంట్‌గా ఈ సినిమాను కంప్లీట్‌ చేసి నాకు చూపించారు. సినిమా చూడగానే చాలా బాగా నచ్చింది. షాకింగ్‌గా అనిపించింది. ఫస్టాఫ్‌ యూత్‌ఫుల్‌ కంటెంట్‌తో వెళ్లిన సెకండాఫ్‌లో ఓ మెచ్యూర్డ్‌ కంటెంట్‌ ఉంది. ఈ సినిమా ద్వారా యూత్‌కు, తల్లిదండ్రులకు దర్శకుడు ఏదో విషయం చెబుతున్నాడు. ఈసినిమా చూసిన తరువాత అందరూ రెస్పాన్స్‌బుల్‌గా ఫీలవుతారు. ఓ మంచి విషయాన్ని ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ వేలో ఈ సినిమాలో దర్శకుడు చెప్పాడు. మంచి సినిమా కాబట్టి నేను కూడా సపోర్ట్‌ చేస్తున్నాను. కంటెంట్‌ నచ్చితే సురేష్‌బాబు సపోర్ట్‌చేయడం ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఇది సక్సెస్‌ఫుల్‌ సినిమా' అన్నారు.

husharu.jpg

నిర్మాత కె.వెంకట్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాను ఎంతో ఇష్టపడి తీశాను. ఏడు సంవత్సరాలుగా ఉన్న అనుభవంతో ఈ సినిమా నిర్మించాను. ఈ సినిమా లైన్‌ను నచ్చి ఈ సినిమా నిర్మించడానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాలో అందరూ ప్రతిభ గల వారు. అందరూ ఈ సినిమాను సొంత సినిమాలా భావించి నిర్మించారు. నిజాయితీగా ఉంటే సక్సెస్‌ వస్తుందనే నమ్మకం నాకుంది. చాలా మంది తల్లిదండ్రులకు, యూత్‌కు ఈ సినిమాలో మేసేజ్‌ ఉంది. చెప్పాలనుకున్న విషయాన్ని ఎంటర్‌టైన్ మెంట్‌ వేలో తీశాం. మీ అందరిని సినిమా అలరిస్తుందన్నారు.

చిన్ని చరణ్‌ మాట్లాడుతూ..' హుషారు పిట్టలు సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా విడుదల చేయడం హ్యపీగా ఉంది. భవిష్యత్‌లో ఈ చిత్ర దర్శకుడు బిక్షు పెద్ద దర్శకుడు అవుతాడు. సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. యూత్‌ ఈ సినిమా చూసి ఉర్రూతలూగుతారు. నేను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న సినిమా ఇది. హుషారు పిట్టలు సినిమా నన్ను మాస్‌ కమర్షియల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నిలబెడుతుంది' అన్నారు. హీరో అన్షు మాట్లాడుతూ.. అందరం ఎంతో కష్టపడి పనిచేశాం. ఈ సినిమాలో మాసినపల్లి రవి పాత్ర చేశాను. టీజర్‌ లాగే సినిమా కూడా అందరికి నచ్చుతుంది. ఈ సినిమాతో హీరోగా పరిచయమైనందుకు సంతోషంగా ఉంది. తప్పకుండా హిట్‌ కొడతాం అన్నారు. హీరోయిన్‌ వాసవి గణేశ‌న్‌ మాట్లాడుతూ.. టీజర్‌కు మంచి సినిమా ఉంటుంది. నాకు తొలి సినిమా. నా పాత్ర తప్పకుండా అందరికి నచ్చుతుంది' అన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 08:17 PM