'పెద్ది' మేనియా.. భారీ ఆఫర్లతో బయ్యర్ల క్యూ! రూ.300 కోట్ల థియేట్రికల్ బిజినెస్!
ABN , Publish Date - Mar 09 , 2026 | 08:45 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది చిత్రం ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది (Peddi) చిత్రం ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఏప్రిల్ 30న విడుదల కాబోతున్న ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలు ఊహించని రీతిలో ఊపందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ కావడం, టీజర్ సంచలనం రేపడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇంకా ట్రైలర్ రాకముందే ప్యాన్ ఇండియా స్థాయిలో వచ్చిన బజ్ చూసి బయ్యర్లు భారీ ఆఫర్లతో నిర్మాతల ముందుకు క్యూ కడుతున్నారు. 2026లో అతి పెద్ద ఓపెనర్‌గా, భారీ రెవిన్యూ జనరేటర్‌గా ఈ చిత్రం నిలుస్తుందని డిస్ట్రిబ్యూటర్లు గట్టిగా నమ్ముతున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం... 'పెద్ది' థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.300 కోట్ల మార్కును తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో రూ. 65 కోట్ల వరకు బిజినెస్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో భాగస్వామిగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు, అగ్ర నిర్మాతలు దిల్ రాజు, ఏషియన్ సునీల్ హక్కుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటక హక్కులు 23 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 40 కోట్లు చొప్పున అగ్రిమెంట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా 'పెద్ది' బిజినెస్ లెక్కలు హాట్ టాపిక్‌గా మారాయి. సీడెడ్ ప్రాంతంలో 35 కోట్లు, కోస్టల్ ఆంధ్రలో సుమారు 85 కోట్ల వరకు ఈ చిత్రం బిజినెస్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు చూస్తుంటే రామ్ చరణ్ మాస్ పవర్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థమవుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, సౌత్ ఇండియా మొత్తం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనికి తోడు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి సినిమా హైప్‌ను మరింత పెంచుతోంది.
నార్త్ ఇండియాలో ఇంకా అధికారికంగా డీల్స్ ప్రారంభం కాకపోయినప్పటికీ, హిందీ ట్రేడ్ సర్కిల్స్‌లో 'పెద్ది' పేరు మారుమోగిపోతోంది. ఈ చిత్రం 'పుష్ప' రేంజ్‌లో మ్యాజిక్ చేస్తుందని అక్కడి బయ్యర్లు బలంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే భారీ ధరలకు హక్కులను దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక థియేట్రికల్ ఆదాయమే కాకుండా డిజిటల్, ఓటిటి, శాటిలైట్, ఆడియో హక్కుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నిర్మాత ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్‌లో ఉన్నారని అందరికీ స్పష్టమవుతోంది.
ఈ నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు ఒక పవర్‌ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఈ ట్రైలర్ గనుక ప్రేక్షకులను మెప్పిస్తే, ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ చర్చలకు మరింత బలం చేకూరుతుంది. ప్రస్తుతం ఐటెం సాంగ్ చిత్రీకరణతో పాటు కొన్ని ప్యాచ్ వర్క్ పనులు మిగిలి ఉన్నప్పటికీ, విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని చిత్ర యూనిట్ స్పష్టం చేస్తోంది. ఏప్రిల్ 30న 'పెద్ది' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయడం ఖాయమని, ఇది ట్రేడ్ పరంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని పరిశ్రమ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి.