Tollywood: ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ఆవిష్కరించిన 'హ్రీం' టీజర్‌

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:49 PM

సీనియర్ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మించిన చిత్రం 'హ్రీం'. పవన్ తాతా, చమింద వర్మ జంటగా రాజేశ్‌ రావూరి ఈ సినిమాను తెరకెక్కించారు. ఎస్వీ కృష్ణారెడ్డి, కె. అచ్చిరెడ్డి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

Hreem Movie

పవన్ తాతా, చమింద వర్మ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా 'హ్రీం'. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల నిర్మిస్తున్నారు. హారర్, మిస్టికల్ థ్రిల్లర్ స్టోరీతో దర్శకుడు రాజేష్ రావూరి దీనిని తెరకెక్కించారు. శనివారం మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, సీనియర్‌ నిర్మాత కె. అచ్చిరెడ్డి చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు.

టీజర్ విడుదల తర్వాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ, 'టీజర్ చాలా బాగుంది. నిర్మాతగా శివ మల్లాల ప్యాషన్ తెలుస్తోంది. ఆయన ప్రొడ్యూసర్‌గా మంచి పేరు తెచ్చుకుని మరిన్ని పెద్ద చిత్రాలు నిర్మించాలి. హీరోయిన్ చమింద వర్మకు ఈ సినిమాతో పేరు రావాలి. అలాగే హీరో పవన్‌కు ఆల్ ది బెస్ట్. రాజీవ్ కనకాల హీరో కావాల్సినవాడు. క్యారెక్టర్ యాక్టర్‌గా ఇప్పుడు ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్' అని అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, 'హ్రీం టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు పేరు హ్రీం అయినా క్రీమ్ లా అనిపిస్తోంది. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.


ప్రొడ్యూసర్ శివ మల్లాల మాట్లాడుతూ, 'దాదాపు పాతికేళ్ళుగా జర్నలిజం కెరీర్ కొనసాగిస్తున్నాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మీ ముందుకు వస్తున్నాను. అవకాశాలు నన్ను వెతుక్కుంటూ రాలేదు. నేనే అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లాను. అవకాశం వచ్చినప్పుడు ధైర్యంగా అడుగేశాను. నేను కిందపడినా ఎంత లోతుకు పడతాను అని ఆలోచించే రిస్క్ చేశాను. క్రిటిక్‌గా రివ్యూలు చెప్పేప్పుడు కూడా ఇండస్ట్రీ మనది అనే ఆలోచించాను. నెగిటివ్ చెప్పడం ఈజీ. కానీ ఆ మూవీ కోసం టీమ్ ఎంత కష్టపడతారో నాకు తెలుసు. సినిమా అంటే సమష్టి కృషి. మనం ప్యాషనేట్‌గా ఉంటే సినిమాకు వచ్చే ఏ అడ్డంకి అయినా దాటడం సులువే. ఈ సినిమా నిర్మించే క్రమంలో నాకు మా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. డైరెక్టర్ రాజేష్ కర్ణపిశాచి అనే కథ చెప్పాడు. ఆ కథ విన్నప్పుడు అందులోని కోర్ పాయింట్ నాకు బాగా నచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో వరంగల్ దగ్గర పెద పెండ్యాల అనే ఊరిలో షూటింగ్ చేశాం. ఆ ఊరి ప్రజలు కూడా చాలా సహకరించారు' అని అన్నారు.


సీనియర్‌ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ, 'చిత్ర నిర్మాణం అంటే భయపడుతుంటాం. కానీ మా శివ మాత్రం ప్రొడక్షన్‌లో నష్టపోడనే ధైర్యం, నమ్మకం నాకున్నాయి. ఎందుకంటే అతనికి ఆ పరిజ్ఞానం, లౌక్యం ఉంది. ఈ సినిమాతో వచ్చిన డబ్బులతో మరిన్ని సినిమాలు నిర్మించే అవకాశం శివకు కలగాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు పవన్ తాతా, చమింద వర్మ, దర్శకుడు రాజేశ్‌ రావూరి, వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ రాజ్ పవన్, మ్యూజిక్ డైరెక్టర్ మార్కస్, నటుడు బెనర్జీ, రాజీవ్‌ కనకాల, రాజశేఖర్ (శుభోదయం సుబ్బారావు), వరుణ్ రెడ్డి తదితరులు సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

‘OG 2’లో ఊహించని మార్పులు.. షూటింగ్ డేట్ ఫిక్స్!

పవన్ అభిమాని నిరంజన్‌‌ను ఈ రోజే కలవడానికి కారణమిదే: బండ్ల గణేష్

మాట నిలబెట్టుకున్న థమన్‌.. ఎంత గొప్ప మనసో!

Updated Date - Jun 20 , 2026 | 06:04 PM