మణిశర్మ మ్యాజిక్.. చెన్నై లవ్ స్టోరీ నుంచి మరో మెలోడీ
ABN , Publish Date - Jul 04 , 2026 | 09:46 PM
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) జంటగా నటించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story).
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) జంటగా నటించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story). రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్కేఎన్ , సాయి రాజేష్ నిర్మించారు. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జులై 24 న చెన్నై లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ వరుసగా లిరికల్ సాంగ్స్ ని రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా హోయిలా హోయిలా అంటూ సాగే బ్యూటిఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం వింటేజ్ మ్యాజిక్ మళ్ళీ రీపీట్ అయ్యినట్లు అనిపిస్తోంది. తన మార్క్ మెలోడీ ట్యూన్స్‌తో ఎన్నో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ అందించిన మణిశర్మ.. ఈ సాంగ్‌ను కూడా వినగానే హృదయానికి హత్తుకునేలా అద్భుతంగా కంపోజ్ చేశారు. ప్రేమికుల మధ్య ఉండే ఒక అందమైన ప్రపంచాన్ని, ఏకాంతాన్ని, ఒకరిపై ఒకరికి ఉన్న అమితమైన ఇష్టాన్ని తెలియజేస్తూ సాగే ఈ పాటలో సాహిత్యాన్ని కూడా అనంత్ శ్రీరామ్ ఎంతో అర్థవంతంగా, క్యాచీగా అందించాడు. మణిశర్మ అందించిన కూల్ అండ్ రిఫ్రెషింగ్ మ్యూజిక్, దానికి తోడు ధనుంజయ్, సాహితి వాయిస్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని చెప్పొచ్చు.
ఇక లిరికల్ వీడియోలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియల లుక్స్, వారి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా కనిపిస్తోంది. విజువల్స్ కూడా లవ్ స్టోరీకి తగ్గట్టుగా ఎంతో ప్లెజెంట్‌గా ఉన్నాయి. చాలా కాలం తర్వాత మణిశర్మ నుంచి వస్తున్న పక్కా మెలోడీ నంబర్ కావడంతో ఈ పాట ఇన్స్టంట్‌గా అందరి ప్లేలిస్ట్‌ల్లోకి చేరిపోతోందని చెప్పొచ్చు. చెన్నై లవ్ స్టోరీ మ్యూజికల్ గా మంచి మార్కులే కొట్టేసింది. మరి కథ పరంగా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.