Mana Shankara Varaprasad Garu: ఎవడ్రా చిరు గ్రేస్ తగ్గిందంది.. ఈ 'హుక్ స్టెప్' చూపించండి
ABN , Publish Date - Jan 07 , 2026 | 09:23 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్వాగ్.. గ్రేస్ గురించి ఇప్పటి జనరేషన్ కి ఏం తెలుసు.. ఒకప్పుడు ఆయన డ్యాన్స్ కి ఉన్న క్రేజ్ ఇంకెవరికీ లేదు అంటే అతిశయోక్తి లేదు.
Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్వాగ్.. గ్రేస్ గురించి ఇప్పటి జనరేషన్ కి ఏం తెలుసు.. ఒకప్పుడు ఆయన డ్యాన్స్ కి ఉన్న క్రేజ్ ఇంకెవరికీ లేదు అంటే అతిశయోక్తి లేదు. ఇప్పటికీ ఆయన గ్రేస్ తగ్గలేదు అని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 12 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక మొదటి నుంచి ఈ సినిమాలో చిరు లుక్ కానీ, డ్యాన్స్ కానీ అభిమానులను ఆకట్టుకున్నా ట్రోల్స్ మాత్రం తప్పలేదు. ఈ వయస్సులో డ్యాన్స్ లు వేయడం రాదు అని కొందరు.. లుక్ బాలేదని మరికొందరు ట్రోల్ చేశారు. ఇంకొందరు అసలు ఇలాంటి కామెడీ సినిమాలు అవసరమా అని కూడా ట్రోల్ చేశారు. తాజాగా వీటన్నింటికి హుక్ స్టెప్ సమాధానం చెప్పింది. బుధవారం మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. అందులో హుక్ స్టెప్ అంటూ సాగే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
హుక్ స్టెప్ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఈ సినిమా సాంగ్స్ కి రాని వైబ్ ఈ సాంగ్ తో వచ్చేసింది. మొన్నటికి మొన్న చిరు - వెంకీ కలిసి స్టెప్ వేసిన సాంగ్ కూడా ఇంత హైప్ రాలేదు. పార్టీలకు ఈ సాంగ్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. 70 ఏళ్ళ వయస్సులో చిరు డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ గ్రేస్.. ఆ స్వాగ్.. ఎనర్జీ కేవలం చిరుకే సొంతం అని చెప్పొచ్చు. ఆయన కెరీర్ లో చేసిన హుక్ స్టెప్స్ మొత్తాన్ని చూపిస్తూ కొత్త స్టెప్ వేసి అలరించాడు చిరు. ఇక ఈ సాంగ్ చూసాక మెగా ఫ్యాన్స్.. ఏది ఇప్పుడు ట్రోల్ చేయండి చిరు గ్రేస్ గురించి అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.