మెగా సినిమాలో ఛాన్స్ పట్టేసిన కూలీ బ్యూటీ

ABN , Publish Date - Jun 06 , 2026 | 08:14 PM

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - బాబీ కొల్లి (Bobby Kolli) కాంబోలో వస్తోన్న చిత్రం మెగా 158. ఇప్పటికే ఈ కాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

Mega 158

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - బాబీ కొల్లి (Bobby Kolli) కాంబోలో వస్తోన్న చిత్రం మెగా 158. ఇప్పటికే ఈ కాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను జరుపుకొని సెట్స్ లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్.. చిరు కూతురిగా నటిస్తోంది. అయితే చిరు సరసన ఎవరు నటిస్తున్నారు అనేది మిస్టరీగా మారింది.


మెగా 158 లో రోజుకో హీరోయిన్ నటిస్తోందని వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి. చిరు భార్యగా ప్రియమణి నటిస్తోండగా.. జర్నలిస్ట్ పాత్రలో నివేతా పేతురాజ్ నటిస్తోందని కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా మరో బ్యూటీ మెగా 158లో నటించనుందని టాక్ నడుస్తోంది. ఈమధ్యనే మలయాళ హాట్ బ్యూటీ హనీ రోజ్.. చిరు సినిమాలో ఛాన్స్ పట్టేసిందని, అడ్వాన్స్ తీసుకొని కూడా డేట్స్ కుదరలేదని తిరిగి ఇచ్చేసినట్లు వార్తలు వినిపించాయి.


ఇక ఇప్పుడు ఆ హనీ రోజ్ పాత్రకు కన్నడ బ్యూటీ రచిత రామ్ ని తీసుకొన్నారని తెలుస్తోంది. కూలీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయ్యిపోయింది రచిత రామ్. రజనీ కాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీలో కళ్యాణిగా ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నాగార్జున కొడుకును మోసం చేసి చంపే పాత్రలో ఆమె విలనిజం వేరే లెవెల్. కూలీ తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న రచిత మెగా ఛాన్స్ పట్టేసింది. ఇదే ఆమె రెండవ తెలుగు సినిమా. ఇప్పటికే చిరు మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి సినిమాలో రచిత హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమా అల్లుడితో.. రెండో సినిమా మామతో చేస్తోన్న రచిత ఈసారి తెలుగులో పాతుకుపోతుందేమో చూడాలి.

Updated Date - Jun 06 , 2026 | 08:42 PM