JJ Perri: ‘టాక్సిక్’కు పని చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా..
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:33 PM
టాక్సిక్.. ప్రస్తుతం సౌత్‌లో బాగా క్రేజ్ ఉన్న సినిమా. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకి రోజుకోజుకీ ఆసక్తి పెరుగుతోంది. మేకర్స్ అప్‌డేట్ కూడా అంతే ఆసక్తిగా ఇస్తున్నారు.
టాక్సిక్(toxic).. ప్రస్తుతం సౌత్‌లో బాగా క్రేజ్ ఉన్న సినిమా. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో రోజుకోజుకీ ఆసక్తి పెరుగుతోంది. మేకర్స్ అప్‌డేట్ కూడా అంతే ఆసక్తిగా ఇస్తున్నారు. ఈ సినిమాకు పనిచేస్తున్న హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జె.జె పెర్రీ బిహైండ్ ద సీన్స్. సెట్‌లో వర్కింగ్ పిక్చర్స్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘ఎంటైర్ టాక్సిక్’ టీమ్‌తోపాటు యశ్, (yash) గీత్ మోహన్‌దాస్‌తో పని చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజువల్స్, యాక్షన్ పార్ట్ హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ నాకు ఎంతో ప్రత్యేకం’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు జెజె పెర్రీ. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. పెర్రీ పోస్ట్, ఆయన మాటల ప్రకారం ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. మరీ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
యశ్ హీరోగా నయనతార, కియారా అడ్వాణీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకురాలు. రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా ఇతర పాత్రధారులు. కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 4న ఈ చిత్రం విడుదల కానుంది.