యాక్సిడెంట్ కేసు.. సందీప్ ఆనంద్ సాయికి బెయిల్

ABN , Publish Date - Sep 03 , 2026 | 07:54 AM

ఖాజాగూడ హిట్ అండ్ రన్ కేసులో అరెస్టయిన నిందితుడు సందీప్ ఆనంద్ సాయికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Anand Sai

ఖాజాగూడ హిట్ అండ్ రన్ కేసులో అరెస్టయిన ప్ర‌ముఖ టాలీవుడ్‌ ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్ సాయి (Anand Sai) కుమారుడు, నిందితుడు సందీప్ ఆనంద్ సాయి (Sandeep Anand Sai) కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం తెల్లవారుజామున ఖాజాగూడలో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ బాధితుడిని ఆస్పత్రికి తరలించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.

దీంతో సందీప్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. సందీప్ ఆనంద్ సాయి డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, తాము నిర్వహించిన పరీక్షల్లో ఇప్పటి వరకు ఏమీ తేలలేదని రాయదుర్గం పోలీసులు స్పష్టం చేశారు.

Updated Date - Sep 03 , 2026 | 08:36 AM