చిన్న సినిమాతో హిట్ కొడితే వచ్చే సంతృప్తే వేరు: చదలవాడ

ABN , Publish Date - Jul 18 , 2026 | 07:46 PM

‘హే చికీతా’ టీమ్‌ని చూస్తే నాకు మళ్లీ పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఎన్నో జన్మల పుణ్యం చేస్తే గానీ నిర్మాతగానో, ఆర్టిస్టుగానో, టెక్నీషియన్‌గానో ఇండస్ట్రీలోకి రాలేము అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు.

Hey Chikittha Pre Release Event

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్ల పై ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మించిన చిత్రం ‘హే చికీతా’ (Hey Chikittha). అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ధనరాజ్ లెక్కల తెరకెక్కించారు. ఈ మూవీ జూలై 24న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను (Hey Chikittha Pre Release Event) గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, కమెడియన్ అలీ, వీఎన్ ఆదిత్య, ప్రసన్న కుమార్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నేను యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ‘లైలా’ అనే మూవీని చేశాను. ఆడియో రైట్స్‌తోనే ఎంతో లాభం వచ్చింది. ‘హే చికీతా’ టీమ్‌ని చూస్తే నాకు మళ్లీ పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఎన్నో జన్మల పుణ్యం చేస్తే గానీ నిర్మాతగానో, ఆర్టిస్టుగానో, టెక్నీషియన్‌గానో ఇండస్ట్రీలోకి రాలేము. ‘హే చికీతా’ విషయంలో ఆర్టిస్టులంతా బాగా నటించారు. అంజి కెమెరా వర్క్ బాగుంది. దర్శకుడు, నిర్మాత ఇలా అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాతో హిట్ కొడితే వచ్చే సంతృప్తి అంతా ఇంతా కాదు. ఇలాంటి చిత్రాలకు మీడియా అండగా నిలబడాలని, ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. కమెడియన్ అలీ మాట్లాడుతూ.. ‘బద్రి’ సినిమాలోని ‘హే చికీతా’ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని తెలుపుతూ.. టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.


గరుడవేగ అంజి మాట్లాడుతూ.. ‘హే చికీతా’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పారు. నిర్మాత ఎన్. అశోక ఆర్ఎన్ఎస్ మాట్లాడుతూ.. ధన్ రాజ్ చెప్పిన కథ నాకెంతో నచ్చింది. అంజితో కలిసి సినిమాని చేయడం ఆనందంగా ఉంది. చరణ్ అర్జున్ పాటలు అద్బుతంగా ఉన్నాయి. జూలై 24న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. చిత్ర దర్శకుడు ధన్ రాజ్ లెక్కల మాట్లాడుతూ.. ఇది నా తొలి చిత్రం. చాలా మంచి సినిమా చేశాను. రైతులు, యూత్ కోసం ఈ మూవీని చేశాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన అంజి అన్నకి, అశోక అన్నకి థాంక్స్. అంజి మామ, అజయ్ పాత్రలు అందరినీ నవ్విస్తాయి. యోధ పాత్ర గురించి సక్సెస్ మీట్‌లో మాట్లాడతాను. చరణ్ అర్జున్ అన్న వల్లే నేను ఇక్కడ నిలబడగలిగాను. మా సినిమాకి మీడియా సపోర్ట్ చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో హాజరైన అతిథులంతా.. సినిమా బిగ్ సక్సెస్ సాధించాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

విక్రమ్-1 రాకెట్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్..

RC17 Update: చరణ్, సుక్కు సినిమా మొదలయ్యేది అప్పుడేనా..

నాట్ ఈజీ.. కానీ, రోజూ ఒక గంటసేపు చేయండి: అనసూయ

Updated Date - Jul 18 , 2026 | 07:46 PM