Hero Suhas: వినోదమే ప్రధానంగా 'హే భగవాన్'
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:30 PM
సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన సినిమా 'హే భగవాన్'. ఈ సినిమాతో యాంకర్ స్రవంతి చొక్కారపు నటిగా ఎంట్రీ ఇస్తోంది.
సుహాస్ (Suhas), 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ నాగారం (Shivani Nagaram) జంటగా నటించిన సినిమా 'హే భగవాన్' (Hey Bhagawan). ఇటీవల విడుదలైన 'లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా' చిత్రాలను విడుదల చేసిన బన్నీ వాస్, వంశీ నందిపాటి 'హే భగవాన్' మూవీని సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 20న మూవీ విడుదల కాబోతున్న సందర్భంగా బుధవారం టీజర్ ను విడుదల చేశారు.
హీరో సుహాస్ మాట్లాడుతూ 'ఈ సినిమాలో నా పాత్ర గత సినిమాలతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ క్యారెక్టర్ చేశాను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ విత్ కంటెంట్. ఇక పై నా సినిమాలు అందర్ని అలరిస్తాయి. ఈ సినిమాకు వంశీ నందిపాటి, బన్నీవాస్ యాడ్ అయిన తరువాత మా టీమ్‌కు మంచి బూస్ట్ వచ్చింది. నరేంద్ర రెడ్డి ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్ ఫిలిమ్ గా నిలుస్తుంది' అని అన్నారు.
నిర్మాత నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ 'ఇది మా మొదటి ప్రయత్నం. ఎంతో ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది. ప్రేక్షకులు సక్సెస్ ఇస్తారనే నమ్మకం ఉంది' అన్నారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ 'ఆరు నెలల ముందు ఈ కథ విన్నాను. ఒక సంవత్సరంలో సినిమా రెడీ అవుతుంది అనుకున్నాను. కానీ అనుకున్న కొద్ది రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసి బెటర్ అవుట్‌పుట్‌తో వచ్చారు. ఈ సినిమా టీజర్ లో ఉన్నట్లుగా ఆడియన్స్ ఎవరైనా బిజినెస్ ఏదో గెస్ చేసి బహుమతి అందుకోవచ్చు. సుహాస్ నుంచి ఆడియన్స్ ఎటువంటి కంటెంట్ కావాలని అనుకుంటున్నారో, ఇందులో అటువంటి కంటెంట్‌ను సుహాస్ డెలివరీ చేశాడు. శివానీకి ఈ సినిమా మూడో బ్లాక్‌బస్టర్ అందిస్తుంది' అన్నారు.
శివానీ నగరం మాట్లాడుతూ 'దర్శకుడు గోపీ ఈ సినిమా విషయంలో చాలా సపోర్ట్ చేశారు. ఇందులో ప్రేక్షకులకు కావాలసినంత వినోదం ఉంది. సెట్ అంతా నవ్వుల మయంగానే ఉండేది. రేపు థియేటర్స్ కూడా అదే రిలీజ్ అవుతుందని నమ్ముతున్నాను. సుహాస్‌తో మరో సినిమా చేయడం ఎంతో స్పెషల్‌గా ఉంది' అని అన్నారు.
చిత్ర దర్శకుడు గోపీ అచ్చర మాట్లాడుతూ 'సుహాస్ నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఎంతో ఫ్రెండ్లీ పర్సన్. ఎంతో డేడికేషన్ ఉన్న నటుడు. శివానీ చాలా ఫ్రొఫెషనల్ ఆర్టిస్ట్. నటుడు సుదర్శన్ ఈ ప్రాజెక్ట్‌కు ఎంతో ప్లస్ అయ్యాడు. ఈ సినిమాతో యాంకర్ స్రవంతి చొక్కారపు నటిగానూ మంచి పేరు తెచ్చుకుంటుంది' అని చెప్పారు. స్రవంతి చొక్కారపు మాట్లాడుతూ 'ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తరుణమిది. యాంకర్‌గా పేరు తెచ్చుకున్న నాకు నటిగా కూడా గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది. నేను నటిగా ఈ సినిమాతో పరిచయం కావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది' అని చెప్పింది.