నరేష్ : ప్రేక్షకుల ఆనందం చూస్తే కళ్లలో నీళ్లు వచ్చాయి

ABN , Publish Date - Feb 20 , 2026 | 06:33 PM

నా కెరీర్‌లో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ చాలా అరుదు. నవ్వులతో థియేటర్లు ఊగిపోవడం చూశాను. ఎవ్వరూ  సీట్లలో కూర్చోవడం లేదు. 

'నా కెరీర్‌లో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ చాలా అరుదు. నవ్వులతో థియేటర్లు ఊగిపోవడం చూశాను. ఎవ్వరూ  సీట్లలో కూర్చోవడం లేదు.  పడి పడి నవ్వుతున్నారు. ప్రేక్షకుల ఆనందం చూస్తుంటే నా కళ్లో నీళ్లు వచ్చాయి. క్లైమాక్స్ పావుగంట ఎమోషనల్‌ సీన్‌తో ఫినిష్‌ అవ్వగానే థియేటర్లలో ప్రేక్షకులు స్టాండింగ్ ఓవెషన్  ఇవ్వడం  ఈ మధ్యకాలంలో చూడలేదు' అని వికె నరేష్ (VK Naresh) అన్నారు.  సుహాస్‌, శివానీ నాగారం జంటగా ఆయన కీలక పాత్ర పోషించిన చిత్రం 'హే బల్‌వంత్‌' (Hey balawanth)  గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. శుక్రవారం సాయంత్రం చిత్ర బృందం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటుచేసింది.  

సుహాస్‌ మాట్లాడుతూ 'నాకెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్ వచ్చిన సినిమా ఇది. ఈ  కలెక్షన్లను నమ్మలేకపోతున్నాను. అందరూ నవ్వుకుంటూ సినిమా చూస్తున్నారని  చెబుతున్నారు. రాను రాను కలెక్షన్లు మరింత పెరుగుతున్నాయి' అన్నారు.  

వంశీ నందిపాటి మాట్లాడుతూ
''సినిమా రిలీజ్ అయినా ప్రతి చోట స్పందన బావుంది.  ఓవర్‌సీస్‌లో ప్రీమియర్స్‌కు 100కె వరకు కలెక్ట్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌ ఫుల్స్‌ అయ్యాయి. మార్నింగ్‌తో పోల్చితే.. మ్యాట్నీకి కలెక్షన్లు పెరిగాయి. ఎంతో ఒత్తిడిలో ఉన్న వారికి 'హే బల్‌వంత్‌' సినిమా మెడిసిన్‌ లాంటిది.  వీకెండ్‌లో బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని ఆశిస్తున్నాను'  అన్నారు.


దర్శకుడు గోపీ మాట్లాడుతూ
'పెయిడ్‌ ప్రీమియర్స్‌ నుంచి మంచి స్పందన వస్తోంది. అందరూ ఫెంటాస్టిక్‌ సినిమా అని అభినందిస్తున్నారు. అందరూ నవ్వి నవ్వి రిలాక్స్‌ అవుతున్నామని చెబుతున్నారు' అన్నారు.

సినిమాకు  రెస్పాన్స్‌ చాలా బాగుందని,  చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా అంటుంటే ఆనందంగా ఉందని నిర్మాత అన్నారు. 

 

Updated Date - Feb 20 , 2026 | 06:33 PM