Samyuktha: దెబ్బలను పట్టించుకోకుండా షూటింగ్...

ABN , Publish Date - Feb 05 , 2026 | 03:37 PM

సంయుక్త నటిస్తున్న ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీ 'ది బ్లాక్ గోల్డ్'. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ను ఆమె డూప్ లేకుండా స్వయంగా చేస్తోందని, గాయాలను సైతం పట్టించుకోవడం లేదని మేకర్స్ చెబుతున్నారు.

The Black Gold Movie

ప్రముఖ కథానాయిక సంయుక్త (Samyuktha) కొత్త సంవత్సరంలో చక్కని విజయాన్ని 'నారీ నారీ నడుమ మురారి' (Naari Naari Naduma Murari) తో అందుకుంది. దాంతో ఆమెలో సరికొత్త జోష్ నెలకొంది. అంతేకాకుండా ఈ యేడాది సంయుక్త నటించిన పలు క్రేజీ ప్రాజెక్ట్స్ విడుదల కాబోతున్నాయి. నిఖిల్ (Nikhil) సరసన సంయుక్త నటించిన నాయికగా నటించిన పాన్ ఇండియా మూవీ 'స్వయంభూ' (Swayambhu) ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది. అలానే పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ స్ట్రీట్' కూడా వేసవి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు.


ఇదిలా ఉంటే సంయుక్త తొలిసారి హీరోయిన్ సెంట్రిక్ మూవీ 'ది బ్లాక్ గోల్డ్' (The Black Gold) లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలోని భారీ యాక్షన్ సీక్వెన్స్ లో సంయుక్త డూప్ సాయం లేకుండా నటిస్తోంది. ఈ స్టంట్స్ షూటింగ్ లో అవుతున్న గాయాలను సైతం ఆమె పట్టించుకోవడం లేదట. సంయుక్త కెరీర్ లో 'ది బ్లాక్ గోల్డ్' ఒక స్పెషల్ మూవీగా నిలవనుందని దర్శకుడు యోగేష్ కె.ఎం.సి. చెబుతున్నారు. ఇది కూడా పాన్ ఇండియా యాక్షన్ డ్రామానే రూపుదిద్దుకుంటోంది. మాగంటి పిక్చర్స్ భాగస్వామ్యంతో హాస్య మూవీస్ బ్యానర్‌పై రజేష్ దండా దీనిని నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ లోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా ఇతర కీలకపాత్రలు చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో 'ది బ్లాక్ గోల్డ్' సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Updated Date - Feb 05 , 2026 | 03:38 PM