ప‌వ‌న్, సురేంద‌ర్ రెడ్డి సినిమా హీరోయిన్ ఫిక్స్‌! ఇమాన్వీ.. ఔట్‌?

ABN , Publish Date - Feb 18 , 2026 | 10:45 AM

పవన్‌ కల్యాణ్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న‌ విష‌యం తెలిసిందే.

Pawan Kalyan

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా సురేందర్‌ రెడ్డి (Surendhar reddy) ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న‌ విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ తీరిక‌లేని రాజ‌కీయాల న‌డుమ‌ వాయిదా ప‌డ్డ ఈ సినిమా ఎట్ట‌కేల‌కు తెర ముందుకు వ‌చ్చేసింది. దాదాపు రెండున్న‌రేళ్ళ విరామం త‌ర్వాత ఇటీవ‌లే ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. కిక్‌, టెంప‌ర్ వంటి సినిమాల‌ క‌థా ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ (Vakkantham Vamsi) ఈ సినిమాకు ప‌ని చేయ‌నుండ‌గా జూన్‌లో ఇది సెట్స్ పైకి వెళ్ల‌నుంది. రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చే అవ‌కాశముంది.

అయితే.. తాజాగా ఈ మూవీలో న‌టించే క‌థానాయిక విష‌యంలో ఓ ఆస‌క్తిక‌ర అప్‌డేట్ సినీ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ చిత్రంలో ఇప్ప‌టికే ప్ర‌భాస్ ఫౌజీలో ఛాన్స్ ప‌ట్టేసిన ఇమాన్వీ (Imanvi) హీరోయిన్‌గా సెల‌క్ట్ అయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ఆ ప్లేస్‌లో ఇటీవ‌ల నారీ నారీ న‌డుమ మురారి సినిమాతో స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చిన సాక్షి వైద్య (Sakshi vaidya) క‌థానాయిక‌గా ఫైన‌ల్ అయిన‌ట్లు తెలుస్తోంది.

sakshivaidya1.jpg

ఇదిలా ఉంటే సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఏజెంట్ సినిమా ద్వారానే ఈ సాక్షి వైద్య‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డం విశేషం. ఇప్పుడు సురేంద‌ర్ రెడ్డి మ‌రోమారు ఈ ముద్దుగుమ్మ‌కే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అయితే.. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటారా లేక ఒక్క‌రా అనేది కూడా తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి.

Updated Date - Feb 18 , 2026 | 06:11 PM