సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'రేపు ఉదయం 10 గంటలకు...'
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:42 AM
చెందు ముద్దు దర్శకత్వంలో రామ్ వీరపనేని నిర్మిస్తున్న సినిమా 'రేపు ఉదయం 10 గంటలకు'. హెబ్బా పటేల్, అభినవ్ గోమటం, చైతన్యరావు, కిరీటి దామరాజు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గతంలో 'ఓ పిట్టకథ (O Pittakadha), అన్నపూర్ణ ఫోటో స్టూడియో (Annapurna Photo Studio)' చిత్రాలను తెరకెక్కించిన చెందు ముద్దు (Chendu Muddu) మరో సినిమాను రూపొందిస్తున్నారు. అదే 'రేపు ఉదయం 10 గంటలకు' (Repu Udayam 10 Gantalaku). మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామ్ వీరపనేని (Ram Veerapaneni) ఈ సినిమాli నిర్మిస్తున్నారు. మార్చి 3న ఈ చిత్రానికి సంబంధించిన ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
'రేపు ఉదయం పది గంటలకు' సినిమాలో అభినవ్ గోమటం, హెబ్బా పటేల్, చైతన్య రావు, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గడియారాన్ని హైలైట్ చేశారు. టైటిల్ వెనుక ఒక క్లాక్, నటీనటులు అందరి వెనుక మరొక క్లాక్ ఉన్నాయి. టైటిల్ వెనుక గడియారంలో పది గంటలు చూపిస్తే... ఆర్టిస్టుల వెనుక గడియారంలో రెండు గంటల సమయాన్ని చూపించారు. వీటి వెనుక కథ తెలియాలంటే టీజర్, ట్రైలర్ విడుదల వరకు వెయిట్ చేయాలంటున్నారు మేకర్స్. సినిమా షూటింగ్ పూర్తయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని రామ్ వీరపనేని తెలిపారు. ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందిస్తున్నారు.