సిద్దు జొన్నలగడ్డతో హసిత్ గోలీ హిలేరియస్ ఎంటర్టైనర్ 

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:03 PM

'రాజ రాజ చోర’తో బాక్సాఫీస్ విజయాన్ని అందుకుని, ‘స్వాగ్’తో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్న దర్శకుడు హసిత్ గోలీ. ప్రస్తుతం ఆయన మరో కొత్త చిత్రానికి తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు. 

'రాజ రాజ చోర’తో బాక్సాఫీస్ విజయాన్ని అందుకుని, ‘స్వాగ్’తో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్న దర్శకుడు హసిత్ గోలీ(Director Hasith Goli) . ప్రస్తుతం ఆయన మరో కొత్త చిత్రానికి తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు. ఈసారి కూడా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌నే ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ (Siddu jonnalagadda) హీరోగా నటిస్తారని తెలిసింది. యువతను ఆకట్టుకునే టైమింగ్, కామెడీ టచ్ ఉన్న సిద్ధు స్టైల్‌కు హసిత్ రాసిన కథ బాగా సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం  స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.

సిద్ధు జొన్నలగడ్డ విషయానికి వస్తే,  ప్రస్తుతం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ దర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జే‌తో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి సినిమా చేసే అంశంపై కూడా చర్చలు సాగుతున్నాయి. సిద్ధు  దగ్గర ‘బ్యాడ్ యాజ్’, ‘కోహినూర్’ వంటి కథలు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందే అవకాశం ఉంది.  ‘టిల్లు క్యూబ్’ కూడా ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

 

Updated Date - Feb 13 , 2026 | 03:06 PM