వేసవికి రాబోతున్న 'దీవాన'

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:20 PM

హర్షిత్‌ రెడ్డి హీరోగా నటించిన 'శుభం' మంచి విజయాన్ని అందుకోవడంతో అతనితో 'దీవాన' చిత్రాన్ని నిర్మించారు. వేసవి కానుకగా రాబోతున్న ఆ సినిమాను గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ రిలీజ్ చేయనుంది.

Deewana movie

పలు వెబ్ సీరిస్ లతో పాటు, సమంత (Samantha) నిర్మించిన 'శుభం' (Subham) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి (Harshith Reddy) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'దీవాన'. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. 'దీవాన' సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమ్మర్ లో 'దీవాన' గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.


ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. గత నెలలో వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా స్టోరీ పోస్టర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందని, ఇంటెన్స్ లవ్ స్టోరీగా వస్తున్న 'దీవాన' (Deewana) హర్షిత్ రెడ్డి కెరీర్‌లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందని మేకర్స్ తెలిపారు. ఈశ్వర్ చంద్ సంగీతం అందిస్తున్న 'దీవాన' చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Updated Date - Mar 10 , 2026 | 04:23 PM