Deewana: దీవాన ఓ రోజు వెనక్కి..
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:09 PM
హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం 'దీవాన' చిత్రం వాయిదా పడింది.
హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న 'దీవాన' చిత్రం వాయిదా పడింది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా... ఒకరోజు ఆలస్యంగా ఈ నెల 20న శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 19 రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించబోతునట్లు మేకర్స్ చెప్పారు. స్మేహ మణిమేగలై కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్ లతో ఆడియెన్స్ ను అలరించాయి. వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు, నర్సింగ్, టోనీ, తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రధారులు.