Harsha Vardhan: శివాజీ మాట్లాడిన తీరు తప్పు.. డ్రెస్సింగ్ కామెంట్స్ పై హర్షవర్ధన్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 16 , 2026 | 04:27 PM
నటుడు హర్ష వర్ధన్ (Harsha Vardhan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమృతం సీరియల్ లో అమృతరావుగా ఆయన నటనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నటుడిగా, రచయితగా హర్ష వర్ధన్ బిజీగా కొనసాగుతున్నాడు.
Harsha Vardhan: నటుడు హర్ష వర్ధన్ (Harsha Vardhan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమృతం సీరియల్ లో అమృతరావుగా ఆయన నటనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నటుడిగా, రచయితగా హర్ష వర్ధన్ బిజీగా కొనసాగుతున్నాడు. ఇక ఈ సంక్రాంతి సినిమాల్లో విన్నర్ గా నిలిచిన మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankara Vara Prasad Garu) సినిమాలో చిరు దగ్గర పనిచేసే అసిస్టెంట్ గా హర్ష వర్ధన్ నటించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత ఆయనకు మంచి అవకాశాలు తలుపుతడతాయి అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.
ఇక హర్ష వర్ధన్.. ఏదైనా మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్ గా మాట్లాడతాడు. ఏదో చెప్పాలి అని చెప్పడం కానీ, హడావిడిగా చెప్పడం కానీ చేయడు. గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి చేసిన కామెంట్స్ ఎంత రచ్చ చేశాయో అందరికీ తెల్సిందే. చిన్మయి, అనసూయ లాంటివారు శివాజీని ఎండగట్టారు. కానీ, చాలామంది మాత్రం శివాజీకే సపోర్ట్ చేస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో హర్ష వర్ధన్.. శివాజీ డ్రెస్సింగ్ వ్యాఖ్యలపై స్పందించాడు. శివాజీ చెప్పిన తీరు తప్పు ఏమో కానీ, ఆయన చెప్పింది సత్యం అని చెప్పుకొచ్చాడు. స్వేచ్ఛ అంటే దుస్తులు మాత్రమే కాదని తెలిపాడు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్.. అమ్మాయిలను అమ్మాయిల్లానే చూడండి. బట్టలతో మీకు సంబంధం లేదు. ఎందుకు అలా చూస్తార్రా.. నార్మల్ గా ఉండొచ్చు కదా మీరు అని అబ్బాయిలకు ఒక స్టేట్మెంట్ పాస్ చేయలేకపోయారు.,. ఎందుకు అన్న ప్రశ్నకు హర్ష వర్ధన్ అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు.
' నేను దొంగ మనసు మార్చే కన్నా ఇంటికి తాళం వేయడాన్ని నమ్ముతాను. అది ఈజీ. నా ఇంట్లో నా తల్లి, చెల్లి, కూతురుకు.. అమ్మా నేను బయటకు వెళ్తున్నాను. తలుపు వేసుకోండి అని చెప్పడం ఈజీ. అంతేకానీ, గేట్ దగ్గర .. దొంగల్లారా.. నేను ఇంట్లో లేను. మా అమ్మను, చెల్లిని ఇబ్బంది పెట్టకండి. లోపలి రాకండి అంటే కష్టం. ఆడపిల్లలకు స్వేచ్ఛ.. చదువుకోవడానికి కావాలి. బయట తిరగడానికి, ఇష్టమైన జాబ్ చేయడానికి, నచ్చినవాడిని పెళ్లి చేసుకోవడానికి ఇలాంటివాటికి కావాలి. అలా అని బట్టలు వేసుకోవడానికి వద్దా అంటే.. కావాలి. కానీ, బట్టలకు మాత్రమే స్వేచ్ఛ అనేది వేరు.
శివాజీ, గరికపాటి ఇద్దరు మాట్లాడారు. శివాజీ మాట్లాడిన తీరు తప్పు. గరికపాటి గారు అలాంటి పదాలు మాట్లాడలేదు కాబట్టి విమర్శించలేదు. శ్రీ రెడ్డి.. ఇండస్ట్రీలో అమ్మాయిలకు సపోర్ట్ చేయాలనీ చాలా ప్రయత్నించింది. కానీ, ఆమె ఇంటర్వ్యూలలో మాట్లాడే భాష వలన అమ్మాయిలే సపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు అనసూయ గురించి అయినా అంతే. రెండు టాపిక్స్ ను మెర్జ్ చేయకూడదు. స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా .. బట్టలు గురించి మాట్లాడుతున్నారా .. ? స్వేచ్ఛలో బట్టలు ఉన్నాయి కానీ, బట్టలే స్వేచ్ఛ కాదు. ఒక మంచి ఉద్దేశ్యం ఉన్నవాళ్లు ప్రజెంటేషన్ లో రాంగా అయితే ఒక శివాజీ, ఒక అనసూయ అవుతారు. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ అని ఆయన క్షమాపణలు చెప్పుకోవడం ఎందుకు.. ? ఈ మీ ఒక పదిమందితో కంప్లైట్ చేయించుకోవడం ఎందుకు..? కోపం తో మాట్లాడకూడదు.. అలా వస్తే బ్యాలెన్స్ తప్పిపోతామని హర్ష వర్ధన్ చెప్పుకొచ్చాడు.