Vishwambhara: విశ్వంభ‌ర మ్యూజిక్‌.. రంగంలోకి 'హ‌నుమాన్' హరిగౌర

ABN , Publish Date - May 05 , 2026 | 05:35 PM

చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం మొదలై చాలాకాలమైంది. దాని తర్వాత మొదలైన ‘మన శంకర వరప్రసాద్‌’ విడుదలై వంద రోజులు పూర్తి చేసుకుంది.

చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రం మొదలై చాలాకాలమైంది. దాని తర్వాత మొదలైన ‘మన శంకర వరప్రసాద్‌’ విడుదలై వంద రోజులు పూర్తి చేసుకుంది. అనివార్య కారణాల వల్ల ‘విశ్వంభర వాయిదా పడుతూ వచ్చింది. కాలం గడుస్తున్నా ఇంకా విడుదల విషయం ఓ కొలిక్కి రాలేదు. జులైలో ఈ సినిమాని రిలీజ్‌ చేస్తారని వార్తలొస్తున్నాయి.

అయితే నిర్మాణ సంస్థ మాత్రం ఇంకా ఏ క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ చిత్రం సాంకేతిక నిపుణుల్లో కీలక మార్పు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కోసం హరిగౌర పని చేస్నునట్లు తెలిసింది.

సూపర్‌హిట్‌ చిత్రాలు హనుమాన్‌, మిరాయ్‌ సినిమాకు ఆయనే సంగీత దర్శకుడు. ఈ రెండూ డివోషనల్‌ టచ్‌ ఉన్న చిత్రాలే! ఈ చిత్రాల బ్యాగ్రౌండ్‌ స్కోర్‌కు మంచి స్పందన వచ్చింది. ‘విశ్వంభర’ కూడా ఆ తరహా చిత్రమే! అందుకే హరిగౌరను తీసుకున్నట్లు తెలిసింది.

ఇప్పటికే ఆయన వర్క్‌ మొదలుపెట్టారని సమాచారం. కీరవాణి ‘వారణాసి’ సినిమా సంగీత పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఒత్తిడి వల్లే విశ్వంభర చిత్రానికి కీరవాణి టైమ్‌ కేటాయించలేకపోతున్నారని తెలిసింది. చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వశిష్ఠ మల్లిడి దర్శకుడు. యు.వి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిప్తోంది.

Updated Date - May 05 , 2026 | 06:10 PM