Hanumaan Ansh: తెలుగు రాష్ట్రాల్లో.. హనుమంతుడి భారీ విగ్రహాలు ఎక్కువగా చూశాను

ABN , Publish Date - Oct 08 , 2026 | 01:59 PM

ఉత్తరాదిలో చిన్న బడ్జెట్‌తో మొదలై భారీ విజయాన్ని అందుకున్న ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

hanumaan ansh

‘హనుమంతుడి ఆశీర్వాదంతోనే ‘హనుమాన్‌ అంశ్‌’ (Hanumaan Ansh) ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది భారతీయుల సినిమా. ప్రజలందరూ మౌత్‌ టాక్‌తో మా సినిమాను ప్రమోట్‌ చేశారు. తెలుగులోనూ ప్రతి మనసుకూ చేరువవుతుందనే నమ్మకం ఉంది’ అని శోభినవ్‌ సత్య (Shobinav Sathya) తెలిపారు.

నీమ్‌ కరోలి బాబా (Neem Karoli Baba) పాత్రలో ఆయన నటించిన ‘హనుమాన్‌ అంశ్‌’ ఉత్తరాదిన విడుదలై అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విశాల్‌ చతుర్వేది దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్‌ ఈ శుక్రవారం తెలుగులో విడుదల చేస్తోంది. నైజామ్‌లో మైత్రి డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ రిలీజ్‌ చేస్తోంది.

ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో విశాల్‌ (Vishal Chaturvedi) మాట్లాడుతూ ‘తెలుగు రాష్ట్రాల్లో అడుగడుగునా హనుమంతుడికి భారీ విగ్రహాలున్నాయి. ఆంజనేయస్వామి భక్తులు అన్నిచోట్లా ఉన్నారు. నాకు 20 ఏళ్లున్నప్పటి నుంచి బాబా భక్తుడిని. ఆయన గురించి రాయడానికి మూడేళ్లు పట్టింది. ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచీ ఏదో ఒక శక్తి మమ్మల్ని ముందుకు నడిపించింది’ అని అన్నారు.

నిర్మాత రాగిణి మాట్లాడుతూ ‘హోంబలే ఫిల్మ్స్‌ తెరకెక్కించిన ‘కాంతార’, ‘మహావతార్‌ నరసింహ’ ఎంత భారీ విజయాలను సాధించాయో, ‘హనుమాన్‌ అంశ్‌’ కూడా ఇక్కడ అంత పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాం’ అని తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్‌ రవిశంకర్‌ మాట్లాడుతూ ‘రెండు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. మా అందరికీ ఇది చెంపపెట్టు’ అని అన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 01:59 PM